
పార్వతీపురం రూరల్: కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలోని ఆగూరు శివ ఇంటి పెరటిలోని టాయిలెట్ గదిలో సుమారు పది అడుగుల కింగ్ కోబ్రా దూరింది. దీనిని చూసిన శివ కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు. కురుపాం అటవీశాఖ రేంజర్ గంగరాజుకు సమాచారం ఇచ్చారు. ఆయన విజయనగరానికి చెందిన స్నేక్ కేచర్స్‌ను పిలిపించి పట్టించారు. అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఏటీఎంలో చోరీకి యత్నించిన నిందితుడి అరెస్ట్
పాచిపెంట: మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బయటగల ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి చోరీకి ప్రయత్నించి పరారైన నిందితుడిని మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై వెంకట సురేష్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎజ్జల గౌరీష్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నిందితుడు చోరీకి యత్నించిన రోజు తనతో పాటు పట్టుకెళ్లిపోయిన రెండు సీసీ కెమెరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.