
విజయవాడ,సాక్షి : పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. పేర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో పోలీసులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది.
గతంలో పేర్ని నాని భార్యకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, తాజాగా జిల్లా కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు.
bnss 316(5) సెక్షన్‌ని పెట్టి ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తోంది. పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఈ సెక్షన్ పేర్ని జయసుధకు వర్తించదని జిల్లా కోర్టు స్పష్టం చేసింది. పేర్ని జయసుధకు ఇవ్వగానే పేర్ని నానిని పోలీసులు ముద్దాయిని చేశారు. పేర్ని నానికి హైకోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అయినప్పటికీ ఇద్దరికీ బెయిల్ మంజూరైనా ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగింది. రేషన్ బియ్యం కేసుల్లో ఎన్నడూ లేని రీతిలో మళ్లీ పేర్ని నాని భార్యని పోలీసులు టార్గెట్ చేశారు. రేపు హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది.