ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్‌ | CM YS Jagan Wishes On AP Formation Day | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్‌

Oct 31 2021 9:06 PM | Updated on Nov 1 2021 8:16 AM

CM YS Jagan Wishes On AP Formation Day  - Sakshi

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.

సాక్షి, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు.

నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10.15 గంటలకు రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement