
సాక్షి, అమరావతి: దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని తన నివాసంలో జక్కంపూడి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. సీఎంతోపాటు.. రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి, తదితరాలు కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు.
మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్.జగన్. pic.twitter.com/X53DGY1Qjd
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 6, 2021