నూతన విద్యా విధానం అమలుపై సిద్ధం కావాలి: సీఎం జగన్‌

CM YS Jagan Review On Nadu Nedu And Foundation Schools - Sakshi

నాడు-నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై సీఎం సమీక్ష

సాక్షి, అమరావతి: నూతన విద్యా విధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని, ఆ దిశగా అడుగులు ముందుకేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. నాడు-నేడు, ఫౌండేషన్‌ స్కూళ్లపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు. రెండో దశ నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించారు. పాఠ్య పుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచడంతో పాటు, కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌పై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ముందుగా వేయి స్కూళ్లను అఫిలియేషన్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు. అన్ని రకాల స్కూళ్లు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఐసీఎస్‌ఈ అఫిలియేషన్‌మీద కూడా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే...:
నాడు – నేడు కింద రెండో విడతలో 12,663 స్కూళ్లు
రూ. 4535.74 కోట్ల ఖర్చుకు ప్రణాళికలు
18,498 అదనపు తరగతి గదులు 
మూడో విడతలో నాడు–నేడు కింద 24,900 స్కూళ్లు
దీనికోసం రూ.7821 కోట్ల ఖర్చు అంచనా
రెండో దఫా నాడు– నేడుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశం

నాడు – నేడు పనులకు సంబంధించి సచివాలయంలో ఇంజినీర్లకు శిక్షణ
సుమారు 12వేల మందికి శిక్షణ అందించనున్న అధికారులు
అనంతరం పేరెంట్స్‌ కమిటీలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు

స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణలపై ప్రత్యేక శ్రద్ద చూపించాలన్న సీఎం
నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇంత డబ్బు ఖర్చుపెట్టిన తర్వాత కచ్చితంగా స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం
లేకపోతే మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లిపోతాయన్న సీఎం
స్కూళ్లలో ఎలాంటి మరమ్మతులు వచ్చినా, ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే చేయించడానికి కంటిజెన్సీ ఫండ్‌ ఒకటి ప్రతి స్కూల్లో ఉంచాలన్న సీఎం
దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలన్న సీఎం
అప్పుడే స్కూళ్లు నిత్యనూతనంగా ఉంటాయన్న సీఎం

జగనన్న విద్యాకానుకపై సీఎం జగన్‌ సమీక్ష
ఈ ఏడాది విద్యాకానుక కింద నూటికి నూరుశాతం పంపిణీ పూర్తయిందని తెలిపిన అధికారులు
కోవిడ్‌ పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నందున వచ్చే ఏడాది పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికే విద్యాకానుక అందించాలన్న సీఎం
వచ్చే ఏడాది విద్యా కానుక కింద ఇవ్వనున్న వస్తువులపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు
విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యతగా ఉండాలని స్పష్టంచేసిన సీఎం
వచ్చే ఏడాది నుంచి విద్యాకానుకలో భాగంగా స్పోర్ట్స్‌ షూ, స్పోర్ట్స్‌ డ్రస్‌ 
మంచి డిజైన్, నాణ్యత ఉండేలా చూడాలన్న సీఎం

స్వేచ్ఛ కార్యక్రమం కింద స్కూల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్‌కిన్స్‌ పంపిణీ కార్యక్రమం
అక్టోబరు మధ్యంతరంలో కార్యక్రమం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామన్న అధికారులు

ఈ సమీక్షా సమావేశాంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్,  పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వ శిక్షా అభయాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) బి ప్రతాప్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇవీ చదవండి:
ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..!
తాగుబోతు రాతలేల?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top