లబ్ధిదారులు ఎవ్వరూ సంక్షేమ పథకాలు మిస్‌ కావొద్దు: సీఎం జగన్‌ | CM YS Jagan Mohan Reddy Released Welfare Funds | Sakshi
Sakshi News home page

లబ్ధిదారులు ఎవ్వరూ సంక్షేమ పథకాలు మిస్‌ కావొద్దు: సీఎం జగన్‌

Jan 5 2024 12:51 PM | Updated on Jan 5 2024 3:49 PM

CM YS Jagan Mohan Reddy Released Welfare Funds - Sakshi

పాక్షి, తాడేపల్లి:  అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్‌ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.  ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింప చేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. 

అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు.  ఈ కార్యక్రమం ద్వారా 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్‌ జమ చేశారు. ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి–జూన్‌ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్‌–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్‌ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్‌–జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

 నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

  • ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతోంది.
  • నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు, కింది స్థాయిలో సచివాలయం వరకు ప్రతి ఒక్కరికీ ఇదొక పెద్ద సంతృప్తినిచ్చే కార్యక్రమం.
  • ఎవరికైనా ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దాన్ని పరిష్కరించడం కోసం వారి తరఫున, మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉందని భరోసా కల్పించే కార్యక్రమం.
  • ఎవరైనా ఏ కారణం చేతనైనా పొరపాటున ఏ పథకం అయినా అందకపోతే, అర్హత ఉండి కూడా పథకం అందకపోయిన పరిస్థితి వచ్చినప్పుడు స్కీమ్ అయిపోయిన తర్వాత నెల సమయం ఇచ్చి అప్లికేషన్ పెట్టించి, వెరిఫికేషన్ చేయించి ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ నష్టపోకుండా లబ్ధిని అందజేసే ఒక మంచి కార్యక్రమం.
  • ఇది మనందరికీ ఎంతో సంతృప్తినిస్తూ ప్రభుత్వం తోడుగా నిలబడుతోందని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీని వల్ల జరుగుతుంది. 
  • ఈ పథకం ప్రతి 6 నెలలకోసారి క్రమం తప్పకుండా జూన్-జూలైలో ఒకసారి, మళ్లీ డిసెంబర్-జనవరిలో మరోసారి.. ఇలా 6 నెలలకు సంబంధించిన పథకాల్లో అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ది పొందని వారికి తోడుగా నిలుస్తున్నాం.
  • దరఖాస్తు చేసుకోకపోయి ఉండటం, ఏదైనా పొరపాట్లు దొర్లడం వల్ల, కావాల్సిన పత్రాలు ఇవ్వని పరిస్థితులు, ఆధార్-బ్యాంక్ అకౌంటు మిస్ మ్యాచ్ లాంటి ఇతరత్రా కారణాల వల్ల పథకం బెనిఫిట్ రాని పరిస్థితి ఉంటే వాళ్లందరికీ ప్రతి ఆరు నెలలకోసారి పథకాలకు సంబంధించి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తున్నాం. 
  • 2021 డిసెంబర్‌లో ఈ కార్యక్రమం మొదలు పెట్టి ప్రతి ఆరు నెలలకోసారి చేస్తున్నాం. ఈరోజు ఐదోసారి చేస్తున్నాం. 
  • అర్హత ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మళ్లీ తోడుగా ఉంటూ నిలబడుతూ దాదాపు రూ.1,700 కోట్లు వారికి అందజేసే కార్యక్రమం. 
  • ఈరోజు దాదాపు వివిధ పథకాలకు సంబంధించి 68,990 మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వారికి మళ్లీ అందజేస్తూ రూ.98 కోట్లకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ల బ్యాంకు ఖాతాల్లో అందేట్టుగా చేస్తున్నాం. 

  • అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా ఇంతకు ముందు పథకం తీసుకొచ్చినప్పుడు 42.62 లక్షల మంది అర్హత పొందారు. డబ్బులు ఖాతాల్లో పడ్డాయి.
  • మిస్ ఔట్ అయిపోయిన 40,616 మంది ఉంటే వారికి కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, వెరిఫికేషన్ పూర్తి కావడం వారికి మళ్లీ వెనక్కి వచ్చేట్టుగా చేస్తున్నాం.
  • జగనన్న చేదోడులో అప్పట్లో 3.25 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు 15 వేల మంది మిస్ ఔట్ అయిన వారికి ఇస్తున్నాం. 
  • ఈబీసీ నేస్తం ద్వారా 4.40 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు 4,180 మందికి లబ్ధి జరిగిస్తున్నాం. 
  • వైఎస్సార్‌ వాహన మిత్ర ద్వారా 2.80 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు మళ్లీ 3,030 మందికి ఈరోజు మంచి జరగబోతోంది. 
  • మత్స్యకార భరోసా కింద అప్పట్లో 1.20 లక్షల మందికి మంచి జరిగితే ఈరోజు మరో 2 వేల మందికి మంచి జరిగిస్తున్నాం. 
  • కళ్యాణమస్తు, షాదీతోఫా ద్వారా అప్పట్లో 29,934 మందికి మంచి జరిగితే 1,912 మందికి మిగిలిపోయిన వారికి మళ్లీ ఈరోజు మంచి జరిగిస్తున్నాం.
  • వైఎస్సార్‌ కాపు నేస్తం 3.60 లక్షలమందికి అప్పట్లో మంచి జరిగితే, ఇప్పుడు 1884 మందికి మంచి జరిగిస్తున్నాం.
  • నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరిగింది. ఇప్పుడు 352 మందికి మంచి జరిగిస్తున్నాం. 
  • వీళ్లే కాకుండా కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం. 
  • ఎవరైనా మిగిలిపోయినా, కొత్తవాళ్లెవరైనా దరఖాస్తు చేసుకోవడం, వెరిఫై చేసి మంజూరు చేయడం, మంజూరు చేసిన వారికి ప్రతి 6 నెలలకు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం జరుగుతోంది. 
  • మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులు ఈనెల నుంచే వారికి కూడా ఇవ్వడం జరుగుతోంది. 
  • 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం.
  • ఏ ఒక్కరూ మిస్ కాకూడదు, పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, శాచురేషన్ పద్ధతిలో వివక్ష, లంచాలకు తావు లేకుండా ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం.
  • పథకం అయిన తర్వాత నెల సమయం ఇచ్చి అప్లికేషన్ పెట్టుకొనే వెసులుబాటు కల్పిస్తూ, వాలంటీర్ సేవలు అందుబాటులో ఉంచడం, సచివాలయంలోకి వారే వెళ్లి దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు, 1902కు ఫోన్ చేసినా వాళ్లు గైడెన్స్ ఇస్తున్నారు. 
  • ఇవన్నీ కూడా గవర్నమెంట్‌లో ఒక జవాబుదారీ తనం, ఒక ట్రాన్స్ పరెన్సీ, ఏ ఒక్కరూ మిస్ కాకూడదన్న భావన, తపన, తాపత్రయంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పే సంకేతం. 
  • ప్రతి 6 నెలలకోసారి జరిగిస్తూ ప్రజలకు మంచి చేసే విషయంలో మనందరి ప్రభుత్వంతోడుగా ఉందని ఒక మెసేజ్ ఓరియెంటెడ్ గా ఈ కార్యక్రమం పని చేస్తుంది. 
  • కలెక్టర్ల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ధ్యాస పెట్టి, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా వాళ్లందరికీ తోడుగా నిలబడి, సహాయ సహకారాలు అందిస్తున్నారు. 
  • వీళ్లందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం.

మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరే
సాంకేతిక కారణాలతో పథకాలు అందని తమలాంటి వారికి తిరిగి మరో అవకాశం ఇస్తూ సంక్షేమాన్ని అమలు చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కారణాలతో సంక్షేమ పథకాలు మిస్‌ అయిన తమకు మళ్లీ తిరిగి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, గతంలో ఎవ్వరూ ఇలా సంక్షేమ పథకాలు ఇవ్వలేదని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందని,  మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరేనంటూ లబ్ధిదారులు ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. 

గతంలో దరఖాస్తు చేసుకుంటే సరిగ్గా రాలేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఏదైనా కారణాలతో మిస్‌ అయిన సంక్షేమ పథకాలు మళ్లీ అమలు చేస్తున్నారని, అర్హత ఉంటే చాలు సిఫార్సు లేకుండానే సంక్షేమాన్ని ఇస్తున్నారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement