కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్‌.. ముమ్మర ఏర్పాట్లు    | CM YS Jagan Kadapa Visit on 20th February | Sakshi
Sakshi News home page

CM Jagan YSR Kadapa Tour: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్‌.. ముమ్మర ఏర్పాట్లు   

Feb 16 2022 12:12 PM | Updated on Feb 16 2022 2:21 PM

CM YS Jagan Kadapa Visit on 20th February - Sakshi

సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 20వ తేదీన ఆదివారం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేసి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై జేసీలు గౌతమి, సాయికాంత్‌వర్మ, ధ్యానచంద్ర, డీఆర్వో మాలోల, ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన కడప నగరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలు అప్పగించామన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో స్పెషల్‌ కలెక్టర్‌ రామ్మోహన్, డ్వామా, ఏపీఎంఐపీ, మెప్మా పీడీలు యదుభూషణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ నాగరాజు, సీపీఓ వెంకట్రావు, టూరిజం అధికారి రాజశేఖర్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ మహేష్‌కుమార్, డీఎస్పీ శివారెడ్డి, సమగ్ర శిక్ష పీడీ ప్రభాకర్‌రెడ్డి, ఆర్టీఓ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. టౌ

చదవండి: (సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి)

పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు   
చింతకొమ్మదిన్నె: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 20న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కుమార్తె వివాహ వేడుకకు కడపకు రానున్న నేపథ్యంలో నగర సమీపంలోని జయరాజ్‌ గార్డెన్స్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ బి.వెంకట శివారెడ్డి తెలిపారు. మంగళవారం బందోబస్తు విషయమై కింది స్థాయి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు అశోక్‌రెడ్డి, సదాశివయ్య, శ్రీరాం శ్రీనివాసులు, సీకేదిన్నె ఎస్‌ఐ ఎం.మంజునాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement