టీచర్లను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది: సీఎం జగన్‌

CM YS Jagan Comments On TDP And Yellow Media - Sakshi

సాక్షి, విజయవాడ: టీచర్లను సైతం రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎల్లో మీడియా కూడా రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తోందన్నారు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పేదలు మంచి చదువులు చదవాలనేదే సంస్కరణల లక్ష్యమన్నారు. అని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందిండచమే కాకుండా మోనులో మార్పులు చేశామన్నారు. టీచర్లు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
చదవండి: గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్‌

ఎవరూ అడక్కపోయినా టీచర్ల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాం. ఎస్జీటీలను స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోట్‌ చేశాం. ఉద్యోగుల పెన్షన్ల విషయంలోనూ చిత్తశుద్ధితో​ పనిచేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ముఖ్యమంత్రిగా విద్యాశాఖపైనే ఎక్కువ సమీక్షలు చేశానని సీఎం అన్నారు.

‘‘ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌. సాన పట్టకపోతే వజ్రమైనా కూడా రాయితోనే సమానం. విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉంది. విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధ్యాయులే వెలికితీస్తారు. నాకు విద్య నేర్పిన గురువులకు రుణపడి ఉంటాను. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అనేక చర్యలు చేపట్టాం. విద్యా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్‌ తరాలకు అవసరమైన అందిస్తున్నాం. పెద్ద చదువులకు పేదరికం అడ్డు రాకూడదు. నాణ్యమైన చదువులు అందరికీ అందుబాటులో ఉండాలి. గత ప్రభుత్వ చర్యలు విద్యను పేదలకు దూరం చేశాయని’’ సీఎం అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top