
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వర్షం, దు...
సింహాచలం పుణ్యక్షే త్రంలో గోడ కూలి ఏ�...
విశాఖపట్నం, సాక్షి: సింహాచలం ఆలయంలో గ�...
హైదరాబాద్, సాక్షి: బీజేపీ నేత, మల్కాజ...
ములుగు, సాక్షి: తెలంగాణ-ఛత్తీస్గఢ్ �...
న్యూఢిల్లీ, సాక్షి: పహల్గాం ఉగ్రదాడి �...
విశాఖపట్నం, సాక్షి: ప్రభుత్వ నిర్లక్�...
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev) �...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట...
ఒకప్పుడు ఋషులు, మహర్షులు కఠోరమైన తపస�...
హైదరాబాద్, సాక్షి: సమ్మె యోచనలో ఉన్న...
మన సాంప్రదాయ కళకు కొద్దిమంది ప్రాణం �...
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ...
అద్వైత సిద్ధాంత బోధకుడిగా..నిత్యస్తో...
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ భార�...
Published Wed, Apr 27 2022 4:51 PM | Last Updated on Wed, Apr 27 2022 10:54 PM
విజయవాడలో సీఎం జగన్ పర్యటన
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్న ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయవాడలోని వించిపేటలో షాజహూర్ ముసాఫిర్ ఖానాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేసింది. ముస్లింల శుభకార్యాలయాలకు అనువుగా దీనిని తీర్చిదిద్దారు.
►వీజీచౌక్ నుంచి పంజాసెంటర్, వించిపేట, రైల్వే బుకింగ్ మార్గంలో వాహనాలను అనుమతించరు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు బ్రాహ్మణ వీధి మీదగా రథం సెంటర్ వైపు వెళ్లాలి.
►ఆర్టీసీ వైజంక్షన్ నుంచి బందరు రోడ్డు మీదుగా బెంజిసర్కిల్కు రాకపోకలు సాగించే వాహనాలు ఐదో నంబర్ రూట్, ఏలూరు రోడ్డు మీదగా రామవరప్పాడు రింగ్ వైపు ప్రయాణించాలి.
►ఇప్తార్ విందుకు హాజరయ్యే ఏ–1 పాస్లు కలిగిన ఆహ్వానితులు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలోకి రెండో నంబర్ గేటు ద్వారా ప్రవేశించి ఫుట్బాల్ కోర్టులో వాహనాలు పార్కింగ్ చేరుకోవాలి.
►ఇఫ్తార్ విందుకు వచ్చే ఇతరులు తమ వాహనాలను బిషప్ అజరయ్య పాఠశాల ప్రాంగణం, స్వరాజ్య మైదానంలో పార్కింగ్ చేసి నాలుగు, ఆరో నంబర్ గేట్ల నుంచి లోపలికి ప్రవేశించాలి.
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందు, ముసాఫిర్ఖానా ప్రారంభోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నామని పోలీస్ కమిషనర్ టి.కె.రాణా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పంజా సెంటర్, ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియాల్లో జరిగే ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వాహనాలను సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఏడు గంటల వరకు మళ్లిస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా అంజద్బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని హాజరుకావాలని కోరారు. ఎనిమిది వేల మంది ముస్లిం సోదరులకు పాస్లు అందజేస్తామన్నారు. స్టేడియం వాటర్ ట్యాంక్ వైపు గేటు నుంచి సాధారణ ప్రజలకు, బందరు రోడ్డు వైపు ప్రధాన గేటు నుంచి వీఐపీలకు ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు కోసం మైనారిటీ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.80 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పవిత్ర రంజూన్ మాసాన్ని పురస్కరించుకుని నేడు (బుధవారం) ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టేడియంలో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం, మైనారిటీశాఖ మంత్రి అంజద్బాషా మంగళవారం ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రుహుల్లా, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావులతో కలిసి పరిశీలించారు.