గడువులోగా అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు పూర్తి చేయాలి: సీఎం జగన్‌

Cm Jagan Review On Ambedkar Statue Construction Works - Sakshi

సాక్షి, తాడేపల్లి: విజయవాడ స్వరాజ్‌ మైదానంలో అంబేద్కర్‌ స్మృతివనం, అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

 • అంబేద్కర్‌ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనది
 • ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు
 • సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచే ప్రాజెక్టు ఇది
 • రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడం ఇది
 • ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుంది
 • నిర్ధేశించుకున్న గడువులోగా అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తి చేయాలి
 • స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు.
 • వచ్చే రిపబ్లిక్‌డే నాటికి పూర్తయ్యే విధంగా... పనులు చేపడుతున్నామన్న సీఎంకు తెలిపిన అధికారులు.
 • జనవరి 15 నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు
 • జనవరి 24న ప్రారంభోత్సవానికి అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనాన్ని సిద్ధం చేస్తామన్న అధికారులు
 • కన్వెన్షన్‌ సెంటర్‌ పనులు కూడా పూర్తి కావాలన్న సీఎం
 • కన్వెన్షన్‌ సెంటర్‌లో మౌలిక సదుపాయాలును పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశం

నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్‌
స్మృతివనం ప్రాంగణమంతా పచ్చదనం ఉట్టిపడేలా మంచి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలన్న సీఎం
నడక దారి పొడవునా గ్రీనరీ  ఉండేలా చూడాలని ఆదేశం
పనులు నిర్ధేశించుకున్న గడువులోగా కచ్చితంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించిన సీఎం
ఆ మేరకు నిరంతరం పనుల పర్యవేక్షణ జరగాలన్న  సీఎం

 • అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు పనుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు.
 • స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ కాన్సెప్ట్‌గా అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు. 
 • అంబేద్కర్‌ విగ్రహం పీఠం ఎత్తు 81 అడుగులు... విగ్రహం ఎత్తు 125 అడుగులు.
 • కృష్ణలంక ప్రాంతంలో నిర్మించిన రక్షణ గోడ పొడవునా 1.2 కిలోమీటర్ల సుందీకరణ పనులపై పలు ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు.
 • పార్క్, వాకింగ్‌ ట్రాక్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు  సీఎంకు వివరించిన అధికారులు. 
 • పనులు చురుగ్గా సాగుతున్నాయన్న అధికారులు
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top