గన్నవరం చేరుకున్న సీఎం జగన్‌ | CM Jagan Return to Gannavaram, Complete Meeting With PM Narendra Modi | Sakshi
Sakshi News home page

గన్నవరం చేరుకున్న సీఎం జగన్‌

Oct 6 2020 6:52 PM | Updated on Oct 6 2020 7:10 PM

CM Jagan Return to Gannavaram, Complete Meeting With PM Narendra Modi - Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్‌ బయలు దేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ మంగళవారం సమావేశమయిన సంగతి తెలిసిందే. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భేటి కొనసాగింది. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ సమావేశం జరిగింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మోదీతో సమావేశం ముగిసిన అనంతరం వీడియో కాన్సరెన్స్‌ ద్వారా అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి హాజరు అయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సీఎం జగన్‌ ఢిల్లీ నుంచి బయలు దేరి రాష్ట్రానికి చేరుకున్నారు. 

చదవండి: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement