సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు జి.మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిపి.వెంకటరమణ, ఏపీఎస్పీడీసీఎల్ అధ్యక్షుడు ఎన్‌వి. సుధాకర్ రెడ్డి, కార్యదర్శులు చంద్రశేఖర్, సోమశేఖర్ రెడ్డి, ఏపీఈపీడీసీఎల్ అధ్యక్ష, కార్యదర్శులు ఏవి.సత్యనారాయణ, లక్ష్మీరావు తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.


