కోవిడ్‌పై పోరులో మంచిపేరు వచ్చిందనే.. తప్పుడు రాతలు 

CM Jagan response to press articles mentioned in the review on Covid - Sakshi

ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడమే వీటి వెనుక ఉద్దేశం

అందుబాటులో 70 శాతానికి పైగా ఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్లు 

ఇలాంటప్పుడు ఆక్సిజన్‌ లేక రోగులు చనిపోయినట్లు ఎలా రాశారు?

కోవిడ్‌ ప్రభావాన్ని చులకన చేశానంటూ మరో పత్రికలో నిస్సిగ్గు రాతలు

సీఎం స్థాయిని దిగజార్చడమే వారి ఉద్దేశం

కోవిడ్‌పై సమీక్షలో ప్రస్తావనకు వచ్చిన పత్రికా కథనాలపై సీఎం జగన్‌ స్పందన

చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న అధికారులు  

అమరావతి: కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు వస్తోందని, దీన్ని తట్టుకోలేక తప్పుడు రాతలు రాస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌పై సమీక్ష సందర్భంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనాలను అధికారులు ఆయన దృష్టికి తీసుకురాగా... ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ అధికారులు సీఎంకు చెప్పారు. సమీక్ష సందర్భంగా... ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మరణించారంటూ ‘ఈనాడు’ రాసిన కథనాన్ని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ పంపిన నివేదికను వివరిస్తూ... విషమ పరిస్థితుల్లో ఉన్న పి.దొరబాబు అనే వ్యక్తిని మే 25న ఆశ్రమ్‌ ఆస్పత్రిలో చేర్చారని, ఆ వ్యక్తికి డయాబెటిస్‌ సహా ఇతర దీర్ఘకాలిక సమస్యలున్నాయని, 25 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి జూన్‌ 26న మరణించారని చెప్పారు.

మిగిలిన ఇద్దరూ కార్డియాక్‌ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ... ‘‘అయినా ఇపుడు రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ చాలా విరివిగా ఉంది. మన అవసరాలకన్నా ఉత్పత్తి ఎక్కువ ఉన్నపుడు కొరత ఎలా వస్తుంది? మనసులో కుళ్లుకుతంత్రాలు ఉంటేనే ఇలాంటి వార్తలు రాస్తారు. కోవిడ్‌ పీక్‌లో ఉన్నప్పుడు ఇలాంటి అబద్దాలు రాసి ఉంటే కనీసం నమ్మైనా నమ్ముతారు కానీ ఇపుడు కోవిడ్‌ తగ్గి 70 శాతానికిపైగా ఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్‌ బెడ్లు అందుబాటులో ఉన్నా ఇలాంటి వార్తలు రాస్తున్నారంటే ఏమనుకోవాలి? వీళ్లకసలు మానవత్వం ఉందా?’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు వస్తోందని, దీన్ని తట్టుకోలేకే తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పారాయన. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నంగా ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌ పీక్‌ స్థాయిలో ఉన్నపుడు 750 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను వినియోగించామని, ప్రస్తుతం అది 180 టన్నులకు తగ్గిందని అధికారులు చెప్పగా... ఇలాంటి పరిస్థితిలో ఆక్సిజన్‌ లేకే ముగ్గురు చనిపోయారని నిస్సిగ్గుగా వార్తలు రాశారంటూ సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి వార్తల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారని ఆయన ప్రశ్నించారు.
కోవిడ్‌పై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని, అధికారులు   

ఎలా రాయగలుగుతున్నారసలు? 
కోవిడ్‌ తీవ్రతను చులకన చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడినట్లుగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాన్ని అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోవిడ్‌పై సమీక్షా సమావేశంలో అందరు అధికారుల ఎదుట కరోనా తీవ్రతను చులకన చేసి మాట్లాడినట్లుగా, అర్థరాత్రి జీసస్‌తో సంభాషించినట్లుగా ఉద్దేశపూర్వకంగా రాసిందన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కూడా గత ఏడాది ప్రారంభంలో ఇలాగే చులకనగా మాట్లాడారు. కరోనా వైరస్‌లేదు.. ఏమీ లేదు. నేను రాత్రి జీసస్‌తో మాట్లాడాను. అసలు వైరస్‌లేదు.. భయపడవద్దు అని జీసస్‌ చెప్పారు. అని జగన్‌రెడ్డి అనడంతో అధికారులు అవాక్కయ్యారు’’ అంటూ ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయనకు చూపించారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ... అసలు ఎవరైనా ఇలాంటి రాతలు ఎలా రాయగలుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఇలాంటి రాతలు ద్వారా ముఖ్యమంత్రి పదవికి విలువ తగ్గించి, దాన్ని అథమస్థాయిలోకి తీసుకెళ్తున్నారు.

చేతిలో ఒక పత్రిక, ఒక టీవీ ఉందని ఇలాంటి రాతలు రాయటమేనా? కోవిడ్‌ నివారణా చర్యలపై ఇంత సీరియస్‌గా సమీక్షలు చేస్తుంటే.. వాటిని అపహాస్యం చేసేలా ఇలాంటి రాతలు రాయడం అత్యంత దురదృష్టకరం. ఇంతమంది అధికారులకు టైంపాస్‌కాక రివ్యూలకు హాజరవుతున్నారా? కరోనా మీద ప్రభుత్వం సీరియస్‌గా లేకపోతే వారానికి రెండు రోజుల పాటు సమీక్షలు చేస్తుందా? ఈ వార్తలు రాసేవారికి కనీసం ఎక్కడోచోటైనా విలువలుండాలి కదా? మీకు  ఏది రాయాలనిపిస్తే అలా రాసేస్తారా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి వచ్చిన మంచిపేరు తనకు మాత్రమే కాదని... అందరు అధికారులు, సిబ్బందికి కూడా అని, అంతా కలిసికట్టుగా పనిచేశారని సీఎం వ్యాఖ్యనించారు. ధ్యాసపెట్టి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం కనకే మంచిపేరు వస్తోందన్నారు. రాష్ట్రస్థాయి నుంచి మొదలుపెడితే... గ్రామస్థాయిలో ఉన్న ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎం, వాలంటీర్లు,  కలెక్టర్లు,  జిల్లా, మండల అధికారులు, వైద్య సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో వ్యవహరించడంవల్ల ఇది సాధ్యమైందన్నారు. ఈ రెండు పత్రికల కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు సీఎంకు చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

29-06-2021
Jun 29, 2021, 08:06 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌తో మృత్యువాతపడిన 77 మంది లాయర్లకు సుప్రీంకోర్టు నివాళులర్పించింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభం...
29-06-2021
Jun 29, 2021, 04:39 IST
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ విషయంలో భారత్‌ అమెరికా రికార్డును దాటేసింది. దేశంలో ఇప్పటివరకు 32.36 కోట్ల డోస్‌లను అందించారు....
29-06-2021
Jun 29, 2021, 03:14 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా కిందకు దిగివస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 15...
28-06-2021
Jun 28, 2021, 20:22 IST
సేరో సర్వే: 51 శాతానికిపైగా బాలబాలికల్లో కోవిడ్‌ యాంటీ బాడీలు
28-06-2021
Jun 28, 2021, 19:09 IST
యూఎస్‌సీ రాస్కి ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఆఫ్తాల్మాలజీ డాక్టర్‌ ఆనీ గ్యూయెన్‌ వంటివారు ‘కంటిపై కరోనా...
28-06-2021
Jun 28, 2021, 17:08 IST
పశ్చిమ బెంగాల్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు.. సడలింపులు ఇలా!
28-06-2021
Jun 28, 2021, 13:08 IST
కరోనా వైరస్‌ మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంటోంది. పైగా వైరస్‌లో కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తూ మనిషికి కునుకు లేకుండా...
28-06-2021
Jun 28, 2021, 03:47 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు చాలామంది బాధితులను పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి....
27-06-2021
Jun 27, 2021, 14:56 IST
ఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడంపై సందిగ్ధతను అధిగమించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 'మన్‌ కీ బాత్‌' ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు....
27-06-2021
Jun 27, 2021, 14:16 IST
ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కరోనా యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్ల అమ్మకాలు ప్రారంభించింది. "కోవిసెల్ఫ్‌" అనే రూ.250 ఖరీదైన ఈ...
27-06-2021
Jun 27, 2021, 11:29 IST
కరోనా వైరస్‌ మహమ్మారి కాలంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం పెరిగింది. 77 దేశాలలోని ఆరోగ్య నిపుణులను సర్వే చేయగా..
27-06-2021
Jun 27, 2021, 10:29 IST
మహారాష్ట్రలో డెల్లా ప్లస్‌ వేరియంట్‌ కేసులుపెరుగుతుండటం, థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినం చేశారు. ...
27-06-2021
Jun 27, 2021, 09:41 IST
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో తీవ్ర ఆక్సిజన్‌ కొరత ఏర్పడటంపై సుప్రీం కోర్టు ప్యానెల్‌ అంద జేసిన...
27-06-2021
Jun 27, 2021, 08:20 IST
సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. జూలై 1 నుంచి విద్యా సంస్థలన్నీ...
27-06-2021
Jun 27, 2021, 08:01 IST
సాక్షి, వాంకిడి(ఆదిలాబాద్‌): కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే జనజీవనం కుదుటపడుతున్న తరుణంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ భయపెడుతోంది....
27-06-2021
Jun 27, 2021, 04:19 IST
తిరుపతి, అన్నమయ్య సర్కిల్‌: కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా వైద్య...
27-06-2021
Jun 27, 2021, 04:14 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌కు సంబంధించిన వేరియంట్‌లు చాలా వస్తున్నాయి.. అంతరించి పోతున్నాయి.. కానీ వైరస్‌ నుంచి మనల్ని మనం...
27-06-2021
Jun 27, 2021, 03:48 IST
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మార్చి నెల నుంచి అన్ని బోధనాసుపత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా మార్చిన సంగతి...
27-06-2021
Jun 27, 2021, 02:45 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ రెండు డోసుల్లో... ఒకటి ఒక కంపెనీ, మరొకటి మరో కంపెనీ (మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ టీకా...
27-06-2021
Jun 27, 2021, 02:33 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 డెల్టా ప్లస్‌ వేరియెంట్‌ కేసులు దేశాన్ని వణికిస్తున్నాయి. ఈ కేసులు 12 రాష్ట్రాలకు విస్తరించగా, తమిళనాడులో తొలి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top