CM Jagan Key Statement In Home Department Review Meeting - Sakshi
Sakshi News home page

హోంశాఖ సమీక్షలో సీఎం జగన్‌ కీలక ప్రకటన

May 4 2023 6:53 PM | Updated on May 4 2023 7:10 PM

Cm Jagan Key Statement In Home Department Review Meeting - Sakshi

హోంశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. జీవో నంబర్-1ని సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

సాక్షి, తాడేపల్లి: హోంశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. జీవో నంబర్-1ని సమర్ధవంతంగా అమలు చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. రోడ్లపై మీటింగ్‌ల వలన మనుషులు చనిపోయే పరిస్థితులు ఉండకూడదన్నారు. సభలకు తక్కువమంది వచ్చినా ఎక్కువగా వచ్చినట్టు చూపించేందుకు రోడ్లపై కిక్కిరిసేలా చేస్తున్నారు.. చంద్రబాబు రెండు సభలలో అమాయకులు చనిపోయారని సీఎం జగన్‌ అన్నారు.

కాగా, సోషల్‌ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలని, దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. గురువారం ఆయన హోంశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్‌ ఉండాలన్నారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలని, దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు.
చదవండి: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కొత్త ప్రతిపాదన 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement