Breadcrumb
- HOME
Live Updates
హరేకృష్ణ గోకుల క్షేత్రానికి శంకుస్థాపన..
హరేకృష్ణ గోకుల క్షేత్రానికి భూమి పూజ చేసిన సీఎం జగన్
తాడేపల్లి మండలం కొలనుకొండలో రూ. 70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హరేకృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్ జగన్ భూమి పూజ నిర్వహించారు. ఇక్కడ ఇస్కాన్ శ్రీవెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాల నిర్మాణం చేపట్టింది. సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు.. యువత కోసం శిక్షణ కేంద్రం, యోగ ధ్యాన కేంద్రాల నిర్మాణం చేపట్టనుంది. ఇస్కాన్ తరపున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు.
కొలనుకొండ చేరుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి మండలం కొలనుకొండ చేరుకున్నారు.
కొలనుకొండ బయల్దేరిన సీఎం జగన్
అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించిన అనంతరం తాడేపల్లి మండలం కొలనుకొండ బయల్దేరారు. ఇక్కడ హరికృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. ఇస్కాన్ తరపున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు. దీనిని రూ.70 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇస్కాన్ శ్రీవెంకటేశ్వరస్వామి, రాధాకృష్ణుల ఆలయాల నిర్మాణం చేపట్టింది.
అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించిన సీఎం జగన్
మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను సీఎం జగన్ శుక్రవారం ప్రారంభించారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన ఆహారం ఇక్కడే తయారు చేస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మధ్యాహ్న భోజనం ఇక్కడినుంచే సరఫరా అవుతుంది. ఇందుకుగానూ, అక్షయపాత్ర ఫౌండేషన్ అత్యాధునిక వంటశాలను ఏర్పాటు చేసింది.
గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సీఎం పర్యటన వివరాలిలా..
►ఉదయం 10.15 గంటలకు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించనున్న సీఎం
►11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రం భూమిపూజ
►ఇస్కాన్ (బెంగళూరు)కు చెందిన హరేకృష్ణ మూమెంట్ ఇండియా ఆద్వర్యంలో నిర్మాణం, ఆరున్నర ఎకరాలలో జాతీయ రహదారి పక్కన కొలనుకొండలో హరేకృష్ణ ప్రాజెక్ట్
►ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ది చేసేలా ఇస్కాన్ ప్రణాళికలు
ఒకేసారి 50 వేల మందికి భోజనం..
మంగళ గిరి ఆత్మకూరు వద్ద ఒకేసారి 50 వేల మందికి భోజనం ఏర్పాటు చేసేందుకు అక్షయపాత్ర ఆధ్వర్యంలో నూతన భవానాన్ని నిర్మించామని, ఈ రెండు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు హరేకృష్ణ హరేరామ మూమెంట్ నేషనల్ ప్రెసిడెంట్ (బెంగళూరు) మధు పండిట్ దాస్, ఆంధ్రా తెలంగాణా అధ్యక్షులు సత్యగౌరి చందన దాస్ విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. వీరితో పాటు అతిరథ మహారధులు హాజరవుతారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద హరేకృష్ణ గోకుల క్షేత్రం
విజయవాడ హరేకృష్ణ మూమెంట్ సభ్యులు గురువారం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని చెన్నై కోల్ కత్తా జాతీయ రహదారి వెంబడి కొలనుకొండ వద్ద నిర్మిస్తున్నామని తెలిపారు. తమ సేవలను గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొలనుకొండలో దేవాదాయ భూమిని తమ సంస్థకు లీజుకు ఇచ్చారని, అందులో రూ.70 కోట్లతో రాధాకృష్ణ, వెంకటే శ్వరస్వామి ఆలయాలు, కల్చరల్ ఎక్స్పో, సంస్కార హాల్, కృష్ణ లీలాస్, గోశాల, అన్నదానం హాల్, మెడిటేషన్ హాల్, ఆశ్రమం, భగవద్గీత మ్యూజియం నిర్మిస్తున్నామని వివరించారు.
హరేకృష్ణ మూమెంట్ ఇండియా
సాక్షి, తాడేపల్లిరూరల్ (మంగళగిరి): కొలనుకొండ జాతీయ రహదారి వెంబడి హరేకృష్ణ మూమెంట్ ఇండియా (విజయవాడ) రూ.80 కోట్ల వ్యయంతో హరేకృష్ణ గోకుల క్షేత్రం నిర్మించనుంది.
Related News By Category
Related News By Tags
-
చిన్నారికి వైఎస్ జగన్ అండ
జగదాంబ (విశాఖ): నిరుపేద కుటుంబానికి చెందిన ఓ చిన్నారి చికిత్సకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతు...
-
వాలంటీర్ హబీబ్ కుమార్తెకు వైఎస్ జగన్ రూ.2 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, విశాఖ: వాలంటీర్ హబీబ్ కుమార్తెకు వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఆ చెక్కును హబీబ్ కుటుంబ సభ్యులకు వైసీపీ నేతలు ...
-
ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తాడేపల్లిలో లక్ష్మీపార్వతి మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వ...
-
లోకేశ్.. చిల్లర రాజకీయాలు మానుకో!
తాడేపల్లి రూరల్: ‘మిస్టర్ లోకేశ్.. చిల్లర రాజకీయాలు మానుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ప్రతిపక్ష నేతలను కించపరిచేందుకు జీతాలు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదు’ అని వైఎస్...
-
పలాసలో కిడ్నీ మార్పిడి విజయవంతం
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో తొలిసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్...


