Andhra Pradesh (AP) Cabinet Meeting Live Updates - Sakshi
Sakshi News home page

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. మొత్తం 63 అంశాలకు ఆమోదముద్ర

Jun 7 2023 10:36 AM | Updated on Jun 7 2023 4:20 PM

CM Jagan Chaired AP Cabinet Meeting Live Updates - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 63 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లును రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు కేబినెట్లో నిర్ణయించారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలుపై ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ విధానం తీసుకొస్తోంది. ఏపీ గ్యారెంటెడ్‌ పెన్షన్‌ స్కీం అమలుకు ఆమోదం తెలిపింది. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ గ్యారెంటీ పెన్షన్ స్కీం బిల్లు ముసాయిదాను ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదించింది.  ఉద్యోగుల భద్రత కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకొచ్చినట్లు ప్రకటించింది.

► పాత ఫించను పథకానికి సమానండే ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత వచ్చే 50 శాతం ఫించనకు తగ్గకుండా, డీఏ క్రమంగా పెరిగేలా కొత్త విధంగా కొత్త బిల్లును రూపొందించారు. గ్యారెంటెడ్ పెన్షన్ బిల్ 2023 పేరుతో బిల్లు ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల(2014, జూన్‌ 2 నుంచి పని చేస్తున్నవాళ్లు) క్రమబద్దీకరణకు ఆమోదంతో పాటు సంక్షేమ పథకాలైన అమ్మ ఒడి పథకం, జగనన్న ఆణిముత్యాలు పథకంతో పాటు ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, అలాగే పీఆర్‌సీ ఏర్పాటునకు, కొత్త డీఏ అమలునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

► ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త పీఆర్‌సీ(12వ) ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. 2022, జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులందరికీ ఏరియర్స్‌తో 2.73 శాతం డీఏ వర్తింపజేయనుంది.  జిల్లా కేంద్రాల్లో పని చేసేవాళ్లకు 12 నుంచి 16 శాతానికి హెచ్‌ఆర్‌ఏను పెంచింది. 

► కేబినెట్‌ ఇవాళ్టి భేటీలో.. 6,840 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇందులో పోలీస్‌ బెటాలియన్‌ ఖాళీలు 3,920 పోస్టులు ఉన్నాయి. అలాగే కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2,118 సహా మరికొన్ని శాఖల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. 

► బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో రెగ్యులర్‌ ఉద్యోగులకు ఆమోదం. 

► కో-ఆపరేటివ్‌ సొసైటీల్లో సూపర్‌ న్యూమరీ పోస్టుకు ఆమోదం. 

► కడప మానసిక వైద్య కళాశాలలో 116 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం. 

► సీతానగరం పీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌కు 23 పోస్టులకు ఆమోదం. 

► పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌.. డయాలసిస్‌ యూనిట్‌కు 41 మెడికల్‌ ఆఫీసర్లకు ఆమోదం తెలిపింది. 

► 476 గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీల్లో నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులకు ఆమోదం. 
 
► గ్రూప్‌-1, 2 పోస్టుల నియమకాలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. 

► అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ ఈఈ పోస్టును ఈఈగా అప్‌గ్రేడ్‌ చేశారు. 

► చిత్తూరు డెయిరీ ప్లాంట్ కు 28 ఎకరాల భూమిని లీజు ప్రతిపాదనకు, ఏపీ పౌరసరఫరాల కార్పోరేషన్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణ సేకరణ, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థలకు భూ కేటాయింపుకు..

► గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 


చదవండి: AP: ఖరీఫ్ సీజన్‌కు కృష్ణా డెల్టా నీటి విడుదల.. నెల ముందుగానే 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement