నాడు చతికిల‘బడి’.. నేడు ఉజ్వలంగా మారి.. | Sakshi
Sakshi News home page

నాడు చతికిల‘బడి’.. నేడు ఉజ్వలంగా మారి..

Published Mon, Apr 8 2024 5:39 AM

Closure of 1785 schools in Chandrababu Naidu Govt: andhra pradesh - Sakshi

సర్కారు బడులను నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం.. 2014–19 మధ్య 1,785 స్కూళ్ల మూసివేత

ప్రైవేటు పాఠశాలల ప్రోత్సాహానికే కుటిల యత్నాలు

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పాఠశాలలకు మహర్దశ

2021లో సమగ్ర అధ్యయనం.. సంస్కరణలు అమలు చేసిన జగన్‌ 

మూతబడిన పాఠశాలలను తిరిగి తెరిపించిన ప్రభుత్వం

మనబడి నాడు–నేడుతో అత్యాధునికంగా మారిన విద్యాలయాలు

రూపుమారిన 45 వేల ప్రభుత్వ పాఠశాలలు 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ బడులను గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారు. బడుల అభివృద్ధిని పూర్తిగా వదిలేయడంతో చాలా వరకూ శిథిలావస్థకు చేరాయి. ఇలాంటి బడుల్లో ఉండలేక చాలామంది పేదింటి పిల్లలు చదువుకు దూరమయ్యారు. బడులను బాగు చేయాల్సిన ఆ ప్రభుత్వం.. సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–19 మధ్య 1,785 పాఠశాలలను మూసివేసింది.

విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను సైతం విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా పూర్తిస్థాయిలో అందివ్వలేకపోయింది. పేద పిల్లలకోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతలేకుండా చేసింది. తన వర్గంగా భావించిన నారాయణ, శ్రీచైతన్య వంటి విద్యా సంస్థలకు మేలు చేసేలా ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేశారు. చివరికి ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టు అప్పగించేలా దిగజార్చింది.

జగన్‌ హయాంలో బడులకు మహర్దశ
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని అనేక సంస్కరణలను అమలు చేసింది. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్ల నిధులను వెచ్చింది 45 వేల ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేలా ప్రణాళికను అమలు చేసింది. ఓ పక్క పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాలో జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేలు జమ చేసే సంక్షేమ పథకాన్ని అందిస్తూనే మరో పక్క విద్యా సంస్కరణలను అమలు చేసింది.

తద్వారా బడిలో హాజరుశాతం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2021లో విద్యా సంస్కరణలపై అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులైన ఉపాధ్యాయుల సూచనలతో ‘నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. మూడో తరగతి నుంచే అత్యున్నత ప్రమాణాలను అందిస్తూ సబ్జెక్టు టీచర్లతో విద్యా బోధన చేపట్టింది. ఫలితంగా 3వ తరగతి నుంచే విద్యార్థులకు బీఈడీ అర్హత గల సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. అంతేగాక 2014–2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం మూసివేసిన 1,785 పాఠశాలలను తిరిగి తెరిపించింది. 

సర్కారు బడుల నిర్వహణలో ఇద్దరికీ ఉన్న వ్యత్యాసం ఇది. గత ప్రభుత్వం సర్కారు బడులపై చిన్నచూపు చూసింది. ప్రైవేటు యాజమాన్యాల మత్తులో పడి పూర్తిగా నిర్వీర్యం చేసింది. రకరకాల కారణాలతో పెద్ద సంఖ్యలో మూసివేసింది. పైగా విద్యనందించడం ప్రభుత్వ బాధ్యత కాదంటూ సరికొత్త భాష్యం చెప్పింది. ఫలితంగా వేలాదిమంది నిరుపేదలు చదువులకు దూరమయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ సర్కారు విద్యారంగంలో ప్రత్యేక సంస్కరణలు తీసుకొచ్చింది.

ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్దింది. ప్రతి గ్రామంలో సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత ఆకర్షణీయంగా తరగతిగదులను మార్చింది. మూతపడిన పాఠశాలలను తెరిపించడమే గాకుండా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి... జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా ఎదుర్కొనేలా పిల్లలకు తర్ఫీదునిచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యావిప్లవం నేడు అంతర్జాతీయ వేదికల ప్రశంసలు అందుకునేలా చేసింది.

ఉత్తమ ఫలితాల సాధనలో ముందంజ
గత ప్రభుత్వం విధానాలతో నిర్వీర్యమైన ప్రభు­త్వ విద్యను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అప్పటికే పలు సంస్థలు చేసిన అధ్యయనాల్లో ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు వయసుకు తగిన అభ్యాస ఫలితాలను సాధించలేకపో­తున్నారని, బోధనా ప్రమాణాలు సైతం తక్కువగా ఉన్నాయని తేల్చారు. ఆరో తరగతికి వచ్చే విద్యార్థులు తక్కువ లెర్నింగ్‌ స్టాండర్డ్స్‌తో ఉంటున్నారని, సిలబస్‌ను సైతం అర్థం చేసుకో­లేకపోతున్నారని, బేసిక్స్‌ కూడా తెలియడం లేదని తెలుసుకున్నారు. అప్పటినుంచి దానిని అధిగమించేందుకు ప్రత్యేక దృష్టిసారించారు.

► 2021–22 విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీల నుంచి ఉన్నత పాఠశాలల వరకు ప్రభుత్వంలోని అన్ని మేనేజ్‌మెంట్లలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారు.
► అంగన్వాడీలను పీపీ–1, పీపీ–2 బోధన స్థాయికి పెంచడంతో పాటు ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్‌ టీవీలతో, హైస్కూళ్లల్లో 62 వేల ఐఎఫ్‌పీ స్క్రీన్స్‌తో డిజిటల్‌ విద్యాబోధన ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బడిపిల్లలు ఇంగ్లిష్‌లో రాణించేందుకు టోఫెల్‌ శిక్షణను ప్రవేశపెట్టారు. 

► బైలింగ్వుల్‌ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టి ఇంగ్లిష్‌ నేర్చుకోవడం సులభతరం చేశారు. ప్రాధమిక పాఠశాలల్లోని ఒకటి నుంచి 5 తరగతుల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో పదాలతోనే పిక్టోరియల్‌ డిక్షనరీని రూపొందించి అందించారు. ‘రోజుకో ఇంగ్లిష్‌ పదం’ నేర్చుకునే విధానం ప్రవేశపెట్టారు. 
► 1000 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధనను అమలు చేశారు. ఈ సంస్కరణల ఫలితాలను సైతం తల్లిదండ్రులు చూశారు. 2023–24 విద్యా సంవత్సరంలో దాదాపు 94 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలోనే పరీక్షలు రాశారు. 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియ­ట్‌లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు అన్నీ ప్రభుత్వ విద్యార్థులే కైవసం చేసుకు­న్నారు. 2025 జూన్‌ నుంచి ఇంటర్నేషనల్‌ బాకలా­రియెట్‌ బోధనకు శ్రీకారం చుట్టనున్నారు.

Advertisement
Advertisement