Chicken Rates: కొండ దిగొస్తున్న కోడి..! తగ్గిన చికెన్‌ ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం..!

Chicken Prices Go Down Skinless Live Bird Price List Here Hyderabad - Sakshi

సామాన్యులకు అందుబాటులోకి వస్తున్న ధరలు  

ప్రస్తుతం స్కిన్‌ లెస్‌ కిలో 170,  విత్‌ స్కిన్‌ కిలో 150  

శ్రావణమాసం ప్రారంభమైతే ధర మరింత తగ్గే అవకాశం 

కడప అగ్రికల్చర్‌: మొన్నామొన్నటి దాకా కొండ దిగని కోడి మాంసం ధరలు వారం రోజుల నుంచి  తగ్గుతూ వస్తున్నాయి. మరో వారం రోజుల్లో శ్రావణమాసం కూడా ప్రారంభంకానుండటంతో చికెన్‌ ధర మరింత తగ్గవచ్చని వ్యాపారులు అంటున్నారు. 20 రోజుల క్రితం రూ.250 పైన ఉన్న ధర వారం రోజుల నుంచి క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం స్కిన్‌ లెస్‌ రూ. 170, విత్‌ స్కిన్‌ కిలో రూ. 150 వచ్చింది.
చదవండి👉🏻గ్లూకోజ్‌ పౌడర్‌ అనుకొని..

ప్రస్తుతం ఎండల తగ్గి వాతావరణం  చల్లబడటంతోపాటు పాటు వర్షాలు కూడా వస్తుండటంతో చికెన్‌  ఉత్పత్తి కొంచం పెరిగిందని వ్యాపారులు తెలిపారు.  వేసవిలో కిలో స్కిన్‌ లెస్‌ చికెన్‌  రూ. 300 పైగా పలికింది. దీంతో సామాన్యులు చికెన్‌ తినాలంటే జంకే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కొండ దిగి వస్తుండడంతో  పేద, మద్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

అయితే, బోనాల జాతర నేపథ్యంలో హైదరాబాద్‌లో చికెన్‌ ధరలు పెద్దగా దిగిరాలేదు. అక్కడ స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో ధర రూ.240 ఉండగా.. లైవ్‌ బర్డ్ 180‌ గా ఉంది. బోన్‌లెస్‌ చికెన్‌ 280 గా ఉంది.
చదవండి👉🏻అమ్మో.. అరటిపండు.. డజన్‌ రూ.80 పైమాటే.. ఎందుకంటే?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top