వైఎస్సార్ మరణంలో బాబు కుట్రపై అనుమానాలు..

సీఎం జగన్‌పై ఏ ఉద్దేశంతో అనుచిత వ్యాఖ్యలు చేశారో బాబు సమాధానం చెప్పాలి
ఎంపీ మోపిదేవి డిమాండ్
పొన్నపల్లి (రేపల్లె): వైఎస్సార్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందేమోనన్న అనుమానాలు బలపడేలా టీడీపీ అధినేత వ్యాఖ్యలున్నాయని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి అనుమానితుల్లో చంద్రబాబు ఒకరని గుర్తుచేశారు. గుంటూరు జిల్లా పొన్నపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశిస్తూ ‘గాలిలో ఎగిరి గాలిలో కలిసిపోతావు’.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే.. వైఎస్సార్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందా.. అనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోందన్నారు. ఏ ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్‌పై అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
(చదవండి: సీఎం గాల్లోనే వస్తాడు.. గాల్లోనే పోతాడు!.. చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు)
సంబంధిత వార్తలు