ఆరోగ్యశ్రీకి పొగ | Chandrababu actions to weaken Arogyashri from the beginning | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీకి పొగ

Jul 30 2024 4:24 AM | Updated on Jul 30 2024 9:50 AM

Chandrababu actions to weaken Arogyashri from the beginning

రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవ్‌.. కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు బిల్లులు రావట్లేదు.. రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెలకొందని వ్యాఖ్య

రూ.25 లక్షల వరకూ వైద్యానికి భరోసానిచ్చిన సంజీవనికి పొగబెట్టేలా బాబు సర్కారు అడుగులు 

రూ.5 లక్షలకే పరిమితమైన కేంద్ర పథకం దయకు వదిలేసి ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి తప్పించుకునే ఎత్తుగడ 

ఇప్పటికే ట్రస్టు నుంచి కాకుండా బీమా పేరుతో అమలు అంటూ మెలిక 

తొలి నుంచి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలా చంద్రబాబు చర్యలు 

2014–19 మధ్య చికిత్సలుపెంచకుండా పేదల ఆరోగ్యంతో ఆటలు 

ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసిన వైఎస్‌ జగన్‌  

చికిత్సలు మూడు రెట్లు.. ఉచిత చికిత్స పరిమితి ఐదు రెట్లు పెంపు 

నాడు టీడీపీ సర్కారు పెట్టిన దాదాపు రూ.700 కోట్ల బకాయిలూ చెల్లింపు 

దేశంలో తొలిసారిగా కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలోకి చేర్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.. గత ఐదేళ్లూ ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం    

ఎంత ఖర్చైనా భరిస్తాం..  
దురదృష్టవశాత్తూ పేదలు అనారోగ్యం పాలైతే ప్రభుత్వం అండగా నిలవాలి. పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఎంత పెద్ద జబ్బు బారినపడినా, వైద్యానికి ఎంత ఖర్చైనా మన ప్రభుత్వమే భరిస్తుంది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని వెళితే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.25 లక్షలు వరకు చికిత్సలు ఉచితంగా అందాలి  – నాడు సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: ‘‘ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు! ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదు! రోగులకు చికి­త్సలు అందని పరిస్థితి! ప్రజలు వైద్యం కోసం ఆయు­ష్మాన్‌ భారత్‌ కార్డును వెంటబెట్టుకుని ఆస్ప­త్రులకు వెళ్లండి. ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. కేంద్ర పథకాన్ని వాడుకుంటే రాష్ట్ర ప్రభు­త్వంపైనా భారం తగ్గుతుంది..!’’ కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌ రాష్ట్రంలో పేదలకు ఇస్తున్న ఉచిత సలహా ఇదీ! ఆరోగ్యశ్రీని ఒక గుదిబండలా భావిస్తూ ప్రొసీజర్లు పెంచకుండా పథకాన్ని నిర్వీర్యం చేసిన సీఎం చంద్రబాబు ధోరణికి పెమ్మ­సాని వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తాజా­గా కేంద్ర మంత్రి హోదా లో పెమ్మసాని మాట్లాడిన మాటలు పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. ఏకంగా 3,200కిపైగా చికిత్సలతో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యానికి భరోసా కల్పించే డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథ­కాన్ని నీరుగార్చేసి కేంద్ర పథకం దయాదాక్షిణ్యాలకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని వదిలేసినట్లు పెమ్మసాని వ్యాఖ్యలు స్పష్టం చేస్తు న్నా­యి. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వ చ్చే­నాటికి టీడీపీ సర్కారు పెట్టిన ఆరోగ్యశ్రీ బకా యిలు రూ.700 కోట్ల మేర ఉండగా వాటిని వైఎస్‌ జగన్‌ పూర్తిగా క్లియర్‌ చేశారు. 

ఈ ఏడాది జనవరి వరకు ఆరోగ్యశ్రీ బకాయిలనూ పెండింగ్‌ లేకుండా చెల్లించి అటు ఆస్ప­త్రులకు ఇటు ప్రజలకు జగన్‌ సంపూర్ణ విశ్వా­సం కల్పించారు. ఎన్నికల కోడ్‌ రావ­డంతో బిల్లుల చెల్లింపులకు బ్రేక్‌ పడింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 2 నెలలు కా­వ­స్తున్నా రూ. 1,600 కోట్లకుపైగా ఆరోగ్య­శ్రీ బకా­యిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలకు గండం ఏర్పడింది. 

పడకేసిన పథకానికి ప్రాణం.. 
డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ఏపీలో కోటిన్నర కుటుంబాలకు ఆపద్భాంధవిగా నిలిచింది. 2014– 19 మధ్య టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీకి వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉండగా ప్రాణం పోశారు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ గుర్తుకొచ్చేలా గత ఐదేళ్లుగా ఈ పథకం అమలైంది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ద్వారా 70 లక్షల మంది రూ.14,470 కోట్ల మేర ప్రయోజనం పొందారు. వారి ముద్రను చెరిపి వేయాలనే తలంపుతో ఆరోగ్య శ్రీ పథకాన్ని కనుమరుగు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ స్థానంలో బీ మా పేరిట ప్రైవేట్‌ కంపెనీని జొప్పించే యత్నంచేస్తున్నారు. ఇది కొనసాగుతుండగానే కేంద్ర పథకాన్నే నమ్ముకోవాలని చెప్పడం ద్వారా ప్రభుత్వ ఆంతర్యాన్ని పెమ్మసాని ఆవిష్కరించారు. రూ.25 లక్షల వరకూ వైద్య సేవలందించే ఆరోగ్యశ్రీని కాదని రూ.5 లక్షల మేర హెల్త్‌ కవరేజీ ఉండే ఆయుష్మాన్‌ పథకాన్ని వినియోగించుకోవాలంటూ సూచించడం దారుణమని వైద్య ఆరోగ్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో మొక్కుబడిగా బీమా అమలు చేయనున్నట్లు చెబుతున్నారు.  

బీమా కంపెనీల చక్కర్లు.. 
ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో బీమా పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కూటమి సర్కారు సన్నద్ధమైన నేపథ్యంలో ఇటీవల ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో 2014–19 మధ్య నామినేటెడ్‌ పదవిలో కొనసాగిన టీడీపీ నేత ఆధ్వర్యంలో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. ఓ ప్రముఖ ఇన్సూరెన్స్‌ కంపెనీకి బాధ్యతలప్పగించేలా సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరికొన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలూ టెండర్లలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం లబి్ధదారులు ఎంత మంది ఉంటారు? కొన్నేళ్లుగా పథకం కోసం ప్రభు త్వం ఎంత ఖర్చు చేసింది? వైద్య సేవలు, ఇతర వివరాల కోసం ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయం చుట్టూ బీమా కంపెనీల ప్రతినిధులు చక్కర్లు కొడుతున్నారు.  

ప్రైవేట్‌ వైపే మొగ్గు.. 
గతంలోనూ విద్య, వైద్య రంగాలను ప్రైవేట్‌ పరం చేయటమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగించారు. తొలి నుంచీ ఈ రంగాల్లో ప్రభుత్వ భాగస్వా మ్యం నామమాత్రంగా ఉండేలా వ్యవహరించారు. వ్యాధులన్నింటినీ ఆరోగ్యశ్రీలో చేర్చడంతోపాటు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికి­త్స, ఆపరేషన్‌ సౌకర్యం కల్పిస్తామంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అనంతరం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు. 2007లో వైఎస్సార్‌ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి పథకా న్ని ప్రారంభించగా అనంతరం చంద్రబాబు సర్కా రు ఎనీ్టఆర్‌ వైద్య సేవగా పేరు మార్చింది. తాజాగా బీమా రూపంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టబోతున్నారు.  

లాభాపేక్షతో సేవలకు గండం 
ప్రస్తుతం డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుండగా కొత్త విధా నంలో లబి్ధదారుల వారీగా ప్రభుత్వం ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా వైద్య సేవల కల్పన చేపట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటి వరకూ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వమే నేరుగా పథకాన్ని అమలు చేయడంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఇ న్సూరెన్స్‌ ఏజెన్సీల చేతుల్లోకి వెళితే లాభాపేక్షతో ప్రజలకు వైద్య సేవలు ప్రశ్నార్థకంగా మారుతాయి.

 ట్రస్టు పర్యవేక్షణలో ఉంటే అందులో ఎంపానెల్డ్‌ అ యిన ఆస్పత్రులు ఏ ప్రొసీజర్‌కు అయినా నిర్దేశించిన ధర ప్రకారమే వైద్య సేవలు అందిస్తాయి. అంతకు మించి ప్రజల నుంచి డబ్బుల వసూళ్లకు పా ల్పడేందుకు వీలుండదు. వసూళ్లకు పాల్పడితే జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ట్రస్టు సీఈవో ఆ­ధ్వర్యంలో ఆస్పత్రిపై చర్యలు తీసుకునేందుకు ఒక వ్యవస్థ ఉంటుంది. అదే ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ ఏజెన్సీలు రంగంలోకి దిగితే ఆస్పత్రులపై ప్రభుత్వ ని యంత్రణ పోతుంది. ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి ప్రజల నుంచి అదనపు వసూళ్లు చేస్తాయి.

గత ఐదేళ్లూ నిశ్చింత..
ఆరోగ్యశ్రీ పథకాన్ని గత ఐదేళ్లలో బలోపేతం చేసి న వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి నిశి్చంత కల్పించారు. 2019 ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.5 లక్షల లోపు వార్షికాదాయ కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చారు. 2019కి ముందు వెయ్యి లోపు మాత్రమే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఉండగా వైఎస్‌ జగన్‌ ఏకంగా 2,371 ఆస్పత్రులకు పథకాన్ని విస్తరించారు. అనంతరం చికిత్స వ్యయ పరిమితిని రూ.5 లక్షలు నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు పెంచారు. 

టీడీపీ హయాంలో కేవలం 1,059 చికిత్సలతో అస్తవ్యస్థంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను ఏకంగా 3,257కి పెంచారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచితంగా చికిత్సలు అందించి పథకానికి రూ.13 వేల కోట్లకు పైగా వెచి్చంచారు. అంతేకాకుండా శస్త్ర చికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లకుపైగా సాయం అందించారు. ఇక దేశంలోనే తొలిసారిగా కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి విపత్తు వేళ ప్రజలకు కొండంత భరోసా కల్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement