నైపుణ్య శిక్షణను పంచుకునేందుకు ‘క్యాట్స్‌’ ఆసక్తి : ఏపీఎస్‌ఎస్‌డీసీ

Challa Madhusudhan Reddy Visits Career Academy and Technical School - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్కిల్‌ కాలేజీలకు నైపుణ్య శిక్షణ విధానాన్ని అందించేందుకు అమెరికాలోని నార్త్‌ కొరోలినాలోని కెరీర్‌ అకాడమీ అండ్‌ టెక్నికల్‌ స్కూల్‌(క్యాట్స్‌) ఆసక్తి కనబరిచింది. అమెరికా పర్యటనలో భాగంగా క్యాట్స్‌ కేంద్రాన్ని ఏపీ నైపుణ్యాభివృద్థి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి సందర్శించారు. అక్కడ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. 

ఆటోమోటివ్‌ టెక్, వెల్డింగ్, అత్యవసర వైద్య చికిత్స, అగ్ని మాపక అకాడమీ, నర్సింగ్, క్యూలినరీ ఆర్ట్స్, ఫిల్మ్‌ మేకింగ్, యానిమేషన్‌ వంటి విభాగాల్లో శిక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాట్స్‌ ప్రిన్సిపాల్‌ లర్రీ ఈ రోగర్స్, ప్రోగ్రామ్‌ క్యాంప్స్‌ డైరెక్టర్‌ డెబ్రాలెస్టర్, ఇతర టెక్నికల్‌ సిబ్బందిని కలిశారు. అక్కడ అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణ విధానాన్ని మనతో పంచుకునేందుకు ఆసక్తి కనబరిచారని ఏపీఎస్‌ఎస్‌డీసీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. (క్లిక్‌: విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. 25న హెచ్‌సీఎల్‌ ‘వాక్‌ ఇన్‌ డ్రైవ్‌’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top