పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం

CEOs of various companies In Global Investors Preparatory Summit - Sakshi

మౌలిక సదుపాయాలు..అనుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ భేష్‌

కోవిడ్‌ సమయంలో ఏపీ సహకారం మరువలేనిదని కితాబు

గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధుల వెల్లడి 

తమ వ్యాపారాన్ని ఏపీలో మరింత విస్తరిస్తామని, కొత్త పరిశ్రమలు నెలకొల్పుతామని స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల కల్పన, అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం భేష్‌ అని గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ప్రశంసించారు. దేశంలోనే వ్యాపార పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంలా ఉందని కీర్తించారు. ఏపీ అందిస్తున్న సహకారంతో వ్యాపార విస్త­రణకు, కొత్త వ్యాపార కార్యకలాపాలకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు వారు వెల్లడించారు.  

విశాఖ­పట్నంలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలో మంగళవా­రం నిర్వహించిన సన్నాహక సదస్సులో వివిధ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు మాట్లాడారు. కోవిడ్‌ వంటి కఠినతర పరిస్థితుల్లోనూ ఏపీ అందించిన సహకారం మరువలేనిదంటూ కొని­యా­డారు. ఈ సదస్సులో ఎవరెవరు ఏమన్నారంటే..

పెట్టుబడులను రెట్టింపు చేస్తాం  
– యమగుచి, ఎండీ, టోరే ఇండస్ట్రీస్‌ (జపాన్‌)
ఇక్కడ రూ.1,000 కోట్ల పెట్టుబడితో రెండు వ్యాపార యూనిట్లు ప్రారంభించాం. అదే సమయంలో కోవిడ్‌ మొదలైంది. ఏపీ ప్రభుత్వ మద్దతుతో జూన్‌ 2020లో ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించాం. 2030 నాటికి మా ప్రస్తుత పెట్టుబడిని రెండింతలు కంటే ఎక్కువ  పెట్టడానికి ప్రణాళిక రూపొందించుకున్నాం.

ఏపీ సహకారంతో మరింత విస్తరిస్తాం
– రోషన్‌ గుణవర్ధన, డైరెక్టర్, ఎవర్టన్‌ టీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఇటలీ)
ఏపీలో మేం గణనీయంగా అభివృద్ధి చెం­దాం. ఏపీ టీ ఉత్పత్తి చేసే రాష్ట్రం కానప్పటికీ, ఏపీపై నమ్మకం ఉంచాం. ఏపీలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అనేది గొప్పగా ఉంది. ప్రభుత్వం అందించిన సహకారంతోనే మేం ఇక్క­డ యూనిట్లు ఏర్పాటుచేశాం. మా యూనిట్లలో 99శాతం మంది ఉద్యోగులు స్థానికులే. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో ఏపీ సర్కారు మాకు మద్దతుగా ఉన్నందుకు ప్రభుత్వం, అధికారులకు కృతజ్ఞతలు. ఏపీలో ప్రభుత్వ సహకారంతో మరింత విస్తరించేందుకు ఎదురుచూస్తున్నాం.

రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో దోహదపడాలని భావిస్తున్నాం  
– సెర్గియో లీ, డైరెక్టర్, అపాచీ, గ్రూప్‌ (తైవాన్‌)
2006లో షూ తయారీ సంస్థను స్థాపించాం. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న తొమ్మిది నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాం. ఏపీ ప్రభుత్వ మద్దతు లేకుండా కంపెనీ విజయం సాధ్యంకాదు. ఎంఓయూపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంతకం చేస్తే ఇప్పుడు మేం పనిచేస్తున్నాం. అపాచీ ఇండియా–2 ప్రాజెక్టు కోసం మేమిప్పుడు ఏపీతో కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో దోహదపడాలని భావిస్తున్నాం. 

ఏపీలో అసాధారణ మద్దతు 
– ఫణి కునార్, సీఎండీ, సెయింట్, గోబైన్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఫ్రాన్స్‌)
రెండు దశాబ్దాల్లో మేం రూ.12,000 కోట్ల­కు పైగా పెట్టుబడి పెట్టాం. కోవిడ్‌ సమయంలో ఏపీలో ఫ్యాక్టరీ ప్రారంభించాం. ఏపీ అసాధారణ మద్దతుతో మేం ప్రారంభించిన యూ­నిట్‌ అత్యంత సంపన్నమైన యూనిట్‌గా మారింది. ఇక్కడి ప్రజల ప్రతిభ, నిబద్ధతతో కూడిన పరిపాల­నా యంత్రాంగం, రాజకీయ నాయ­కత్వం మేం మరిం­త విజయవంతమయ్యేందుకు తోడ్పడింది. దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఎంచుకుంటే, ఏపీ స్వర్గధామంగా ఉంటుంది.

ఏపీలో మంచి వాతావరణం
– రవిసన్నారెడ్డి, శ్రీసిటీ ఫౌండర్, ఎండీ
ఏపీలో పెట్టుబడులకు మంచి వాతావరణం ఉంది. ఈ సదస్సుకు 60 దేశాలకు సంబంధించిన పారిశ్రామిక­వేత్తలు రావడం సంతోషం. ఢిల్లీ సదస్సు విజయవంతమైంది. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. మార్చిలో విశాఖలో జరగబోయే సమ్మిట్‌ మరింత విజవయంతం అవుతుంది.

ముఖ్యమంత్రికి భవిష్యత్తు దార్శనికత 
– సుచిత్ర ఎల్లా, సీఐఐ సదరన్‌ చాప్టర్‌ అధ్యక్షురాలు
పరిశ్రమలకు సింగిల్‌ విండో తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం ఏపీ. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉంది. సీఐఐ ఎక్కువ కాలం దివంగత సీఎం వైఎస్సార్‌తో కలిసి పని­చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌కు భవి­ష్యత్తు దార్శ­ని­కత ఉంది. తద్వారా ఏపీ ప్రగతిశీల అభివృద్ధిని చూస్తో­ంది. గ్లోబల్‌ ఎకనామిక్‌ చెయిన్‌ వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వృద్ధి ఒక బలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తోంది. 

ప్రపంచస్థాయి కార్ల ఉత్పత్తికి ఏపీ సహకారం
– టే జిన్‌ పార్క్, ఎండీ, కియా మోటర్స్, (కొరియా)
రాష్ట్రంలో కియా నిర్వహణకు వనరుల మద్దతుతో పాటు ఆటోమోటివ్‌ బెల్ట్‌ చైన్‌ను అభివృద్ధి చేయడం, పెంపొందించడంలో ఏపీ ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌లతో సహా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కార్ల ఉత్పత్తికి ప్రభుత్వం మాకు సహాయం చేసింది. కృష్ణపట్నం, చెన్నై వంటి ప్రధాన ఓడరేవులకు కనెక్టివిటీ సౌలభ్యంతో పాటు 95 దేశాలలో మా కార్లను విక్రయించడానికి వీలు కల్పించింది. కోవిడ్‌ సమయంలోనూ సురక్షితంగా కార్ల తయారీకి మాకు మద్దతిచ్చిన  ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

వ్యాపార విస్తరణకు దేశంలో ఏపీ ఉత్తమం
– దీపక్‌ ధర్మరాజన్‌ అయ్యర్, ప్రెసిడెంట్, క్యాడ్‌బరీ ఇండియా (యూఎస్‌ఏ)
ఏపీతో భాగస్వామి కావడం మాకు గర్వకారణం. శ్రీసిటీలో మేం మా వ్యాపార యూనిట్లను ప్రారంభించినప్పటి నుండి ఏపీ చురు­కైన మద్దతిస్తోంది. రూ.2,500 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా 6వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించాం. సంస్థలో 80­శాతం మంది ఉద్యోగులు స్థానికులే. ఇప్పటికే ఆరు ఆపరేటింగ్‌ యూనిట్లు ఉండగా, త్వరలో మరొకటి అందుబాటులోకి రానుంది. దేశం మొత్తంలోనే అత్యుత్తమ సింగిల్‌ విండో క్లియరెన్స్‌ సిస్టమ్‌ను తెచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మేం దేశవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నా.. ఏపీ అత్యుత్తమం.

ఆంధ్రప్రదేశ్‌కు సీఎం జగన్‌ పెద్ద ఆస్తి
–  సుమంత్‌ సిన్హా, అసోచామ్‌ అధ్యక్షుడు
ఏపీకు పెద్ద సీఎం జగన్‌ పెద్ద ఆస్తి. ఆయన నాయకత్వంలో రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. ఏపీని గమ్య­స్థానంగా ఎంచుకోవాలని పారిశ్రామికవే­త్త­లం­దరినీ కోరు­తు­న్నా. రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు స్నేహ పూర్వకంగా ఉన్నా­యి. రాష్ట్ర జీడీపీ 50 బిలియన్‌ డాలర్లకు పైగా దేశంలో ఎని­మిదో స్థానంలోఉంది. మూడే­ళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజి­నెస్‌లో తొలి స్థానంలో ఉంది. రెన్యువబుల్, క్లీన్‌ ఎనర్జీలో ముం­దంజలో ఉంది. ఏపీకి పారిశ్రామిక వేత్తలు రావడా­నికి సహా­య అందించడానికి సీఎం ముందుచూ­పుతో ఉన్నారు. 

నిస్సందేహంగా పెట్టుబడులు పెట్టొచ్చు
– గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి
ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి.  పారిశ్రామికవే­త్తలకు రాష్ట్రంలో సింగిల్‌ విండో సిస్టమ్‌తో అన్ని విధాలా సహకారం ఉంటుంది. పెట్టుబ­డుల అను­మ­తులకు డిజి­టల్‌ ప్లాట్‌ఫామ్‌ అందిస్తుంది. 23 శాఖల పరి­ధిలో 93 రకాల సేవలు అందుబాటులో ఉన్నా­యి. దేశాబివృద్ధిలో కీలక­పాత్ర పోషి­స్తున్న పారి­శ్రామికవేత్తలు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌గా ఉంటున్న ఏపీలో పెట్టుబడులు నిస్సందేహంగా పెట్టొచ్చు. సమస్యల పరిష్కా­రానికి గ్రీవెన్స్‌సెల్‌ ఉంది. విశాఖలో సదస్సుకు పారిశ్రామిక వేత్తలం­తా హాజరు కావాలి.

ఏపీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాం
– దేవయాని ఘోష్, నాస్‌కామ్‌ అధ్యక్షురాలు
ఏపీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాం. ఇప్పటికే సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఏపీతో కలిసి పని చేస్తున్నాం. డీప్‌టెక్‌ రంగంలో కలిసి పని చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం హైపర్‌ డిజి­టల్‌ యుగంలోకి వెళ్తున్నాం. దీనికి కావా­ల్సిన వనరులన్నీ ఏపీలో ఉన్నాయి. రాష్ట్రా­నికి తీర­ప్రాంతం పెద్ద అడ్వాంటేజ్‌. బెస్ట్‌ పోర్టు ఇన్‌­ఫ్రా­స్ట్ర­క్చర్‌ ఉంది. ప్రపంచం ఎదురు చూస్తున్న ఎన­ర్జీ, లాజిస్టిక్, ఎడ్యుకేషన్‌ రంగాల్లో ఏపీకి సామ­ర్థ్యం ఉంది. సీఎం డాక్యుమెంట్‌ ఆకట్టుకు­ంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top