ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్‌ | Central Election Commission Notification for By-election to MLC | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్‌

Mar 8 2022 3:50 AM | Updated on Mar 8 2022 9:17 AM

Central Election Commission Notification for By-election to MLC - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ కరీమున్నీసా అకాల మరణంతో ఖాళీ అయిన స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్‌19, 2021 నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థానానికి  కాలపరిమితి మార్చి29, 2027వరకు ఉండడంతో ఆ కాలపరిమితికి ఉప ఎన్నికను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి కె.విజయానంద్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

శాసన సభ్యుల కోటాలో జరిగే ఈ ఎన్నికల ప్రక్రియను మార్చి 28లోగా ముగించాలని తెలిపింది. మార్చి 14 నుంచి నామినేషన్ల స్వీకరణ, మార్చి 15న నామినేషన్ల పరిశీలన, మార్చి 17 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ, అవసరమైతే మార్చి 24న ఎన్నిక జరుగుతుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉపఎన్నికకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా ఏపీ శాసనసభ ఉపకార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డి, సహాయరిటర్నింగ్‌ ఆఫీసర్‌గా ఏపీ శాసనసభ ఉపకార్యదర్శి ఆర్‌.వనితారాణిని నియమిస్తూ విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement