అధికారానికి ధనదాహం తోడై వ్యవస్థల్ని గుప్పిటపట్టి విచ్చలవిడిగా చెలరేగిపోతుంటే ...అడుగడుగునా బెల్ట్ షాపులు కనిపిస్తాయి. మంచినీళ్లకైనా కొదవుంటుందేమో కానీ మద్యం మాత్రం ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతూనే ఉంటుంది. గుడి పక్కన, బడి ఎదుట బెల్టు షాపులు నడుస్తూనే ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా రహదారి పక్కనే వైన్ షాప్ నడుస్తున్నా అధికారులకు మాత్రం కనిపించదు. ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారపార్టీ నేతల దందా మీద మాత్రం అధికారులు ఈగ వాలనివ్వరు. కూటమి పాలనలో రాష్ట్రంలో ఇదీ పరిస్థితి...













