ముంపు ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని ఎవరు చెప్పారు బాబు? | Bahujana Parirakshana Samithi Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ముంపు ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని ఎవరు చెప్పారు బాబు?

Dec 5 2022 7:47 AM | Updated on Dec 5 2022 10:50 AM

Bahujana Parirakshana Samithi Slams Chandrababu Naidu - Sakshi

తాడికొండ : ఏపీలో రాజధాని ఏర్పాటుకు వేసిన జీఎన్‌రావు, బోస్టన్, శివరామకృష్ణన్‌ నిపుణుల కమిటీల నివేదికలు అమరావతిలో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకం కాదా చంద్రబాబూ.. అని బహుజన పరిరక్షణ సమితి నేతలు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 798వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆదివారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

ఆ నాడు నిపుణుల కమిటీలు అటవీ భూములు లేదా, దొనకొండ ప్రాంతం, అభివృద్ధి  చెందిన విశాఖ నగరం, ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న మరేదైనా ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు ప్రతిపాదించాయనేది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. 

మూడు పంటలు పండే భూములను నాశనం చేసి ముంపు ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని ఎవరైనా చెప్పారేమో.. బాబు నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. కులపిచ్చి, కులగజ్జితో నిండిన బాబు ఆయన వత్తాసుదారులు.. సీఎంగా వైఎస్‌ జగన్‌ను చూడలేక తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు సిద్ధమయ్యారని, ఇందుకోసం అమరావతి పేరుతో రైతులను అడ్డుగా పెట్టి దొంగ ఉద్యమం చేయించారని ఆరోపించారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్న చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ నమ్మరని హెచ్చరించారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నేతలు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, పులి దాసు, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement