‘ఇవాళ నేను ఇంజనీరింగ్‌ చదువుతున్నానంటే జగనన్నే కారణం’

b tech Student Indumathi Speaks About jagnanna Vidhya Deevena At Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తిరుపతి నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తారకరామ స్టేడియంలో జరిగిన విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్నారు. బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన సొమ్ము జమ చేశారు సీఎం జగన్‌. జగనన్న విద్యా దీవెన కింద 2022 జనవరి–మార్చి త్రైమాసికానికి గాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను జమ చేశారు.

ఈ కార్యక్రమంలో ‘జగనన్న విద్యాదీవెన పథకం’ ద్వారా లబ్ధిపొందిన బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి ఇందుమతి మాట్లాడింది. ఇవాళ తను ఇంజనీరింగ్‌ చదువుతున్నానంటే జగనన్నే కారణమని తెలపింది. సీఎం జగనన్నకు విద్యార్థులంతా రుణపడి ఉంటామని పేర్కొంది. తన తండ్రి  సామన్య రైతు అని,  తననుఇంజనీరింగ్‌ చదివించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. అదే సీఎం జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సులభంగా చదువును పూర్తి చేసుకున్నానని పేర్కొంది. అలాగే హాస్టల్‌ వసతి కోసం ప్రతి సంవత్సరం రూ. 20 వేలు వస్తున్నాయని చెప్పింది.
చదవండి: చంద్రబాబుకు బాదుడే బాదుడు తప్పదు: మంత్రి ఆర్కే రోజా

‘నాతో పాటు నా కుటుంబాన్ని కూడా జగనన్న ప్రభుత్వం సాయపడుతుంది. చెల్లెకి అమ్మఒడి పథకం ద్వారా 15 వేలు, తండ్రికి రైతు భరోసా ద్వారా 13,500.. నానమ్మకు ఆసరా ఫించన్‌ వస్తుంది. ఇలా ఎన్నో కుటుంబాలను సీఎం జగన్‌ ఆదుకుంటున్నారు. ఇందుకు సీఎం జగన్‌కు కృతజ్ఙతలు. జగనన్న విద్యాదీవెన ద్వారా చదువుకొని కాలేజ్‌ ప్లేస్‌మెంట్స్‌లో మూడు ఉద్యోగాలు సాధించానని జగనన్న చెల్లిగా గర్వంగా చెబుతున్నాను. ఇలా జగనన్న ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అని ప్రసంగించింది. అనంతరం సీఎం జగన్‌ సదరు విద్యార్ధిని ఆశీర్వదించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top