‘విశాఖ బీచ్‌ రోడ్‌లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు’ | Avanthi Srinivas Says Vangapandu Prasad Rao Vardhanthi In Vizag | Sakshi
Sakshi News home page

‘విశాఖ బీచ్‌ రోడ్‌లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు’

Aug 3 2021 4:33 PM | Updated on Aug 3 2021 4:39 PM

Avanthi Srinivas Says Vangapandu Prasad Rao Vardhanthi In Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం: దివంగత ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు వర్థంతిని విశాఖపట్నంలో రేపు(బుధవారం) నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 4న వంగపండు వర్థంతిని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వంగపడు ప్రసాదరావు స్మారక అవార్డు పేరిట ఉత్తమ జానపద కళాకారునికి రూ.2 లక్షల అవార్డు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. విశాఖ బీచ్‌ రోడ్‌లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement