సామాన్యులకు అంతరాలయ దర్శనం

Arasavalli Temple New Arjitha Seva Services - Sakshi

అరసవల్లిలో కొత్త ఆర్జిత సేవలు

కొత్తగా అంతరాలయ దర్శనానికి రూ.100

సూర్యనమస్కార పూజల టిక్కెట్లు రూ.100, రూ.300

సెప్టెంబర్‌ 3 నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు

అరసవల్లి(శ్రీకాకుళం):  అరసవల్లి ఆదిత్యుని క్షేత్రంలో కొత్త ఆర్జిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇంతవరకు దాతలు, ప్రముఖులకే దక్కిన అంతరాలయ దర్శ నం ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండేలా ఆలయ అధికారులు చేసిన ప్రతిపాదనకు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆమోదాన్ని ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి శనివారం వరకు ప్రత్యేక సమయాల్లో అంతరాలయ ద ర్శనానికి ప్రత్యేకంగా టిక్కెట్లను ప్రవేశపెడుతూ దే వదాయ శాఖ నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే ప్ర త్యేక సూర్యనమస్కారాల పూజలకు కూడా ప్రత్యేక టిక్కెట్లను నిర్ణయిస్తూనే.. అష్టోత్తర, సహస్ర నామార్చనలు, భోగ సమర్పణ టిక్కెట్ల ధరలను సైతం స్వ ల్పంగా పెంచుతూ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచే ఈ కొత్త ధరల విధానాలను అమలు చేయనున్నట్లు ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్‌ ప్రకటించారు.  

అయితే ముఖ్యంగా అన్ని ఆదివారాలు, రథసప్తమి, క్షీరాబ్ధి ద్వాదశి, వార్షిక కల్యాణం, వైకుంఠ ఏ కాదశి తదితర పర్వదినాల్లో మాత్రం అంతరాలయ దర్శనం, అష్టోత్తర, సహస్ర నామార్చనలు వంటి ఆర్జిత సేవలకు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్నవరంలో సత్యన్నారాయణ స్వామి వ్రతాల మాదిరిగా సూర్యనమస్కార పూజలను, సింహాచలంలో అప్పన్న స్వామి అంతరాలయ దర్శనాలు లాగానే అరసవల్లిలో కూడా కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి. 

సూర్యనమస్కారాల పూజలకు.. 
సంపూర్ణ ఆరోగ్యం కోసం జరిపించుకునే సూర్యనమస్కారాల పూజలను రెండు స్థాయిల్లో జరగనున్నా యి. ఆలయ అనివెట్టి మండపానికి ఇరువైపులా ఉన్న మండపాల్లో సూర్యనమస్కార పూజలు నిర్వహిస్తే ఒక్కొక్కరికి రూ.300 చొప్పున టిక్కెట్టు ధర ను, అలాగే ఇంద్ర పుష్కరిణి మార్గంలో ఉన్న సూర్యనమస్కార మండపంలో చేయించుకుంటేæ ఒక్కొక్కరికి రూ.100 చొప్పున టిక్కెట్టు ధరగా నిర్ణయించా రు. ఈ పూజలు ఆదివారంతో సహా ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్ర మే అనుమతి ఉంటుంది. ఒక్కో బ్యాచ్‌కు సుమారు 35 నిమిషాల వరకు పూజాసమయం ఉంటుంది. ఇంతవరకు ఈ సూర్య నమస్కార పూజల టిక్కెట్టు ధర రూ.50 ఉండేది.  

నామార్చనల పూజలు.. 
ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి ఉదయం 8 నుంచి 11 గంటల వరకు అంతరాలయంలో అష్టోత్తర శతనామార్చనకు రూ.50 (పాత ధర రూ.20), సహస్రనామార్చనకు ఒక్కొక్కరికి రూ.100 (పాత ధర రూ.30)గా నిర్ణయించారు.  

క్షీరాన్న భోగం సమర్పణకు రూ.100 
ఆదిత్యుని ఎంతో ఇష్టమైన క్షీరాన్న భోగ సమర్పణ పూజ ధరను రూ.50 నుంచి రూ.100కి పెంచుతూ నిర్ణయించారు. అయితే కేవలం ఆదివారం రోజునే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మాత్రమే ఈ భోగ సేవకు అనుమతి ఉంటుంది. 

అంతరాలయ దర్శన టిక్కెట్టు రూ.100 
ఆదిత్యుని అంతరాలయ దర్శనానికి ఒక్కో భక్తునికి రూ.100 టిక్కెట్టుగా నిర్ణయించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు అలాగే సా యంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే ఈ అంతరాలయ దర్శనం ఉంటుంది. ఇక ఆదివారాల్లో యథావిధిగా విశిష్ట దర్శనం (రూ.500) టిక్కెట్టుకు ఇద్దరు చొప్పున, ప్రత్యేక దర్శన టిక్కెట్టు ఒక్కొక్కరికి రూ.100 చొప్పున దర్శనాలకు అవకాశాలు ఉంటాయి. ఆదివారాల్లో ఈ దర్శనాల టిక్కెట్టు భక్తులకు అంతరాలయ దర్శనం ఉండదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top