‘ప్రజలు మరిచిపోలేదు.. అదో పెద్ద జోక్‌’ | Araku MLA Chetti Palguna Fire On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

మరోసారి అపరిచితుడు బయటపడ్డారు..

Jul 26 2020 2:39 PM | Updated on Jul 26 2020 2:49 PM

Araku MLA Chetti Palguna Fire On Pawan Kalyan - Sakshi

సాక్షి, అరకు: పవన్‌కల్యాణ్‌లో మరోసారి అపరిచితుడు బయటపడ్డారని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ విమర్శించారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో​ రాజధాని వద్దనే హక్కు పవన్‌కల్యాణ్‌కు లేదని మండిపడ్డారు.గాజువాక ప్రజలు ఛీ కొట్టడంతో విశాఖకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ‘‘విశాఖ మరో నందిగ్రామ్‌ అవుతుందనే పవన్‌ మాటల్లో అర్థం ఏమిటి?. విశాఖలో విధ్వంసానికి చంద్రబాబు నాయుడుతో కలిసి కుట్ర పన్నుతున్నారా?’’  అని ప్రశ్నించారు. విశాఖకు వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబుకు విశాఖ ఎయిర్‌పోర్టులో పట్టిన గతే పవన్‌కు పడుతుందని హెచ్చరించారు. (బాబు, వపన్‌లకు పనిపాట లేదు)

‘‘పవన్‌కల్యాణ్‌కి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. గతంలో పాడేరు నుంచి పోటీ చేస్తానని పవన్ అన్న మాటలు జనం మరిచిపోలేదు. అదో పెద్ద జోక్ గా గిరిజనం చెప్పుకుంటున్నారు. మీకు రాజకీయాల్లో చంద్రబాబు పరువు లేకుండా చేశారు. ఇప్పుడు సినిమాల్లో నటిస్తే కనీసం ఆస్తులైనా మిగులుతాయని’’ ఎమ్మెల్యే ఫాల్గుణ హితవు పలికారు. (ఓడిపోవడం వల్లనే పవన్‌కు ఉత్తరాంధ్రపై ద్వేషం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement