
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ విభాగాల్లోని పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల నిర్వహణ తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సోమవారం ప్రకటించింది. ఈమేరకు కమిషన్ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ (జీఎస్‌ఎంఏ) పరీక్ష, సబ్జెక్టు పేపర్ల పరీక్షలకు వేర్వేరు తేదీలను ప్రకటించారు. షెడ్యూళ్లను కమిషన్ వెబ్‌సైట్లో ఉంచారు. తెలుగు రిపోర్టర్ ఏపీ లెజిస్లేచర్ పోస్టులకు పరీక్షను విజయవాడలో మాత్రమే నిర్వహించనున్నారు.