
హోటళ్ల ప్రైవేటీకరణపై ఏపీ పర్యాటకశాఖ వివరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకశాఖ వాణిజ్య కేంద్రాలను నేరుగా నిర్వహించడం కంటే, ప్రైవేటు సంస్థలకు అప్పగించడమే ఉత్తమమని భావిస్తున్నట్టు ఏపీ పర్యాటక సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏపీ పర్యాటక విధానం ప్రకారమే ఈ వ్యూహాత్మక విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపింది. పోటీతత్వాన్ని పెంచి పర్యాటక హోటళ్లæ సేవలను మెరుగుపరచడం కోసం ప్రైవేటు‡ సంస్థలకు అప్పగిస్తున్నట్టు సమరి్థంచుకుంది.
ఏపీ పర్యాటకశాఖలోని హోటళ్లను ప్రైవేటు పరం చేస్తున్న వైనంపై ‘నిట్టూరిజం’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనంపై టూరిజం శాఖ స్పందించింది. హోటళ్ల ప్రైవేటు పరం నిజమేనని చెప్పకనే చెప్పింది. ఎస్‌ఈడీ టికెట్ల కేటాయింపు నిలిపివేయాలనేది టీటీడీ విధాన నిర్ణయమని పేర్కొంది. కాగా, ఈ ప్రకటనను సంస్థ ఎండీ పేరుతో కాకుండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరుతో ఇవ్వడం గమనార్హం.