
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ ఆన్‌లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుం తదితర వివరాలకు aptet.apcfss.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10.30 నుంచి ఈ వెబ్‌సైట్ నుంచి సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.