రేపే ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. ఒకేసారి ఫస్ట్‌, సెకండియర్‌ రిజల్ట్స్‌ | Sakshi
Sakshi News home page

AP Inter Results 2023: రేపే ఏపీ ఇంటర్‌ ఫలితాలు.. ఒకేసారి ఫస్ట్‌, సెకండియర్‌ రిజల్ట్స్‌.. ఎన్ని గంటలకంటే?

Published Tue, Apr 25 2023 6:34 PM

AP Inter results 2023 released on April 26th - Sakshi

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇలా ఒకేసారి ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. రేపు(బుధవారం) సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజ‌రయ్యారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 15వ తేదీన‌ ప్రథమ సంవత్సరం, 16వ తేదీన‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విష‌యం తెలిసిందే. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలను ఇంటర్‌ బోర్డు ప్రకటించబోతోంది.


ఫలితాల కోసం క్లిక్ చేయండి

Advertisement
Advertisement