AP Inter Results: ఏపీ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

AP Inter 2nd Year Exam Results 2021 Released: Check For Marks Details - Sakshi

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విడుదల చేశారు. సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌ అయినట్లు ఆయన ప్రకటించారు. ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దు చేశామని, కరోనా నిబంధనలు పాటించి ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించామని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు.

పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్ట్‌ల యావరేజ్‌కి 30 శాతం.. ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రతిభకి 70 శాతం వెయిటేజ్‌తో ఫలితాలు ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయిన  విద్యార్థులను పాస్ చేశామని తెలిపారు. విద్యార్థులకు ఈ ఫలితాలపై అసంతృప్తి ఉంటే కోవిడ్ తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా మార్కులే ప్రకటించామన్నారు.

మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే బెటర్ మెంట్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పదవ తరగతి ఫలితాలను వారం రోజులలో ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. అడ్మిషన్లలో అవకతవకలకి పాల్పడే కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్‌ హెచ్చరించారు.
ఫలితాల కోసం
www.sakshieducation.com
www.examresults.ap.nic.in
www.results.bie.ap.gov.in
www.bie.ap.gov.in
www.results.apcfss.in
 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top