అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం | AP High Court Angry With Sullurpet Police Granted Relief to Posani | Sakshi
Sakshi News home page

అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

Apr 10 2025 1:11 PM | Updated on Apr 10 2025 1:45 PM

AP High Court Angry With Sullurpet Police Granted Relief to Posani

అమరావతి, సాక్షి: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారన్న కేసులో సూళ్లూరుపేట పోలీసులు పోసానిని విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తదుపురి చర్యలు నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం స్టే జారీ చేసింది. 

సూళ్ళూరు పేట పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేసులో విచారణ అధికారిగా ఉన్న సీఐ మురళీ కృష్ణపై న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తం చేసింది. 

తమ ఆదేశాలను మీరి దర్యాప్తు అధికారి(IO) వ్యవహరించారని, కేసులో అదనంగా 111 సెక్షన్ పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారని సెక్షన్లు నమోదు చేశారని పేర్కొంది. అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఐ మురళీ కృష్ణకు ఫాం-1 నోటీసు జారీ చేసింది. రిప్లై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల 24కి పోసాని పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement