దుమ్ముదులిపిన జీఎస్టీ వసూళ్లు

AP GST collection in October stood at a record Rs 2480 crore - Sakshi

అక్టోబర్‌లో రాష్ట్ర వసూళ్లు రూ.2,480 కోట్లు  

గతేడాదితో పోలిస్తే 26 శాతం వృద్ధి 

దేశవ్యాప్తంగా రూ.1.05 లక్షల కోట్లు వసూళ్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు.. కోవిడ్‌ ప్రబలడానికి ముందునాటి పరిస్థితులకు చేరుకున్నాయి. జీఎస్టీ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్‌ నెలలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2,480 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో ఈ స్థాయిలో పన్నులు వసూలు కావడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1,975 కోట్లు. అదేనెలలో ఈ ఏడాది 26 శాతం వృద్ధితో రూ.2,480 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల్లో పేర్కొంది. దసరా పండుగకు తోడు కోవిడ్‌తో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థికరంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు జీఎస్టీ వసూళ్లు పెరగడానికి దోహదపడ్డాయని వాణిజ్యపన్నులశాఖ అధికారులు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వృద్ధిరేటు అధికంగా ఉండటమే దీనికి నిదర్శనమంటున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో 5 శాతం వంతున, తమిళనాడులో 13, ఒడిశాలో 21 శాతం వృద్ధి నమోదైంది. పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించడం వల్ల అక్టోబర్‌లో రూ.350 కోట్ల మేర అదనంగా వసూలైనట్లు చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్సెస్‌ పీయూ‹Ùకుమార్‌ చెప్పారు. 

ఈ ఏడాది తొలిసారిగా కనీస రక్షిత 
ఆదాయానికి మించి: 2020–21 సంవత్సరానికి కనీస రక్షిత ఆదాయం నెలకు రూ.2,225 కోట్లుగా నిర్ణయించారు. ఇంతకంటే తగ్గిన ఆదాయం మొత్తాన్ని కేంద్రం పరిహారం రూపంలో చెల్లిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా అక్టోబర్‌లో కనీస రక్షిత ఆదాయం మించి పన్ను వసూలైంది. ఏప్రిల్‌– సెపె్టంబర్‌ కాలానికి కనీస రక్షిత ఆదాయం కింద రూ.13,350 కోట్లు రావాల్సి ఉండగా రూ.8,850.62 కోట్లు మాత్రమే వచి్చంది. ఆరునెలల్లో రూ.4,499.38 కోట్ల మేర తక్కువ వసూలైంది. ఈ ఆరునెలల్లో సగటున నెలకు రూ.1,475.10 మాత్రమే జీఎస్టీ వసూలైంది. 

దేశంలో తొలిసారి లక్షకోట్లు 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల మార్కును అధిగమించాయి. అక్టోబర్‌ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,05,155 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థికశాఖ ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌ నెలలో వసూలైంది రూ.95,379 కోట్లు. వరుసగా రెండునెలల నుంచి జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండటం ఆరి్థకవ్యవస్థ తిరిగి గాడిలో పడుతుందన్న సంకేతాలిస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top