ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో విడుదల

AP Govt Released Village Ward Secretariat Employees Probation Declaration GO - Sakshi

సాక్షి, విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను శనివారం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవోఎంఎస్‌ నెంబర్ 5ను  జారీ చేసింది. 

అలాగే.. సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ లకు బేసిక్ పే రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేయగా.. ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుంచి రూ. 72,810 ఖరారు చేసింది. 

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. కేవలం 4 నెలల్లోనే వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు. ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల ప్రకారం అర్హులైన వారికి జూన్‌ నెలాఖరు కల్లా ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి, జూలై నెల(ఆగస్టు 1న చెల్లించే)కు పెరిగిన జీతాలు అమలు చేయాలని సీఎం జగన్‌ ఈ ఏడాది జనవరిలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ మధ్య ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడటంతో గత నెల రోజులుగా నెల్లూరు జిల్లా అంతటా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top