
మొక్కుబడిగా సదరం స్క్రీనింగ్ శిబిరాలు
వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 173 శిబిరాలు
కూటమి హయాంలో 112 చోట్ల మాత్రమే
నాడు ప్రతిరోజూ నిర్వహిస్తే... నేడు వారంలో ఒక్కరోజు మాత్రమే
దివ్యాంగులకు వైకల్య ధ్రువీకరణ పత్రాల జారీకి చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు రవీంద్ర. బాపట్ల జిల్లా వంకాలయపాడు గ్రామం. ఏడాది క్రితం ఇతనికి పక్షవాతం వచి్చంది. దీంతో మంచానికే పరిమితమైపోయాడు. కదల్లేని దుస్థితి. చికిత్స కొనసాగుతోంది. మందులు వాడుతున్నాడు. ఇలాంటి దైన్యంలో వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం ఏడాది నుంచి కుటుంబ సభ్యులు ప్రయతి్నస్తున్నారు. సదరం స్లాట్‌లు విడుదల చేశారని తెలిసిన ప్రతిసారీ కుటుంబ సభ్యులు మీ–సేవకు వెళ్లడం, స్లాట్‌లు అయిపోయాయని చెప్పడంతో వెనుదిరగడం పరిపాటిగా మారిపోయింది.
సాక్షి, అమరావతి: రవీంద్ర తరహాలో రాష్ట్రంలోని వేలాది మంది దివ్యాంగులు వైకల్య ధ్రువీకరణ పత్రాలకు నోచుకోలేకపోతున్నారు. గద్దెనెక్కిన వెంటనే సామాజిక భద్రతా
పింఛన్లకు కోత పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో పింఛన్‌ల రీ–వెరిఫికేషన్ చేపట్టారు. దివ్యాంగ పింఛన్ లబి్ధదారులకు రీ–అసెస్మెంట్ బాధ్యతను వైద్య శాఖకు అప్పజెప్పారు. ఈ క్రమంలో కొత్త సదరం సరి్టఫికెట్ల ప్రక్రియను వైద్య శాఖ అటకెక్కించింది.
వారంలో ఒక్క రోజే
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 56 ప్రభుత్వాస్పత్రుల్లో వారంలో ఒక రోజు మాత్రమే సదరం శిబిరాలు నిర్వహించేవారు. ఈ క్యాంపుల్లో సగటున నెలకు 2715 అసెస్‌మెంట్‌లు చేసేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాటి పరిస్థితులు తలపిస్తున్నాయి. పింఛన్‌ల రీ–అసెస్మెంట్ పేరిట ఏకంగా ప్రభుత్వ వైద్యులనే లబి్ధదారుల ఇళ్లకు కూటమి ప్రభుత్వం పంపింది. ఆస్పత్రుల్లో ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి పింఛన్లకు కోత పెట్టడానికి కంకణం కట్టుకుంది. పింఛన్లు తొలగించి పేదల నోట్లో మట్టికొట్టడంపై పెట్టిన శ్రద్ధలో ఒక వంతైనా కొత్త సదరం సరి్టఫికెట్‌ల జారీపై చూపడం లేదు. మొక్కుబడిగా వారంలో ఒక్క రోజు (ఏపీవీవీపీ, బోధనాస్పత్రుల్లో ఒక్కో రోజు) మాత్రమే సదరం క్యాంప్‌లను నిర్వహిస్తోంది.
అరకొర స్లాట్లు.. అధికంగా పోటీదారులు
స్లాట్ రిజిస్ట్రేషన్‌పై ఒత్తిడి తీవ్రమయింది. పైగా విభాగాల వారీ వారానికి వందల సంఖ్యలోనే స్లాట్‌లు విడుదల చేస్తుండటంతో గంటల్లోనే అయిపోతున్నాయి. దీంతో సదరం స్క్రీనింగ్ కోసం స్లాట్ దక్కించుకోవడమే రాష్ట్రంలోని దివ్యాంగులు, బాధితులకు పదివేలన్నట్లుగా మారింది.
వైఎస్ జగన్ హయంలో..
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 56 ఆస్పత్రుల్లో మొక్కుబడిగా సదరం స్క్రీనింగ్ నిర్వహించేవారు. వైఎస్ జగన్ అదనంగా మరో 117 ఆస్పత్రులను కలిపి 173 చోట్ల సదరం శిబిరాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ ఆస్పత్రులోనైనా స్లాట్ బుక్ చేసుకుని అసెస్‌మెంట్‌కు హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. దీంతో టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైకల్య ధ్రువీకరణ ప్రక్రియ సులభతరం అయింది. నెలకు 8680 చొప్పున అసెస్‌మెంట్‌లు చేపట్టారు. కాగా కూటమి ప్రభుత్వం 61 చోట్ల శిబిరాలను ఎత్తేసింది. 112 చోట్ల వారంలో కేవలం ఒక రోజు మాత్రమే స్క్రీనింగ్ చేపడుతోంది. గతంతో పోల్చితే సగం మేర కూడా అసెస్‌మెంట్‌లు జరగని దుస్థితి నెలకొంది.