breaking news
Disability Certificate
-
స్లాట్ దక్కితే అదే పదివేలు
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు రవీంద్ర. బాపట్ల జిల్లా వంకాలయపాడు గ్రామం. ఏడాది క్రితం ఇతనికి పక్షవాతం వచి్చంది. దీంతో మంచానికే పరిమితమైపోయాడు. కదల్లేని దుస్థితి. చికిత్స కొనసాగుతోంది. మందులు వాడుతున్నాడు. ఇలాంటి దైన్యంలో వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం ఏడాది నుంచి కుటుంబ సభ్యులు ప్రయతి్నస్తున్నారు. సదరం స్లాట్లు విడుదల చేశారని తెలిసిన ప్రతిసారీ కుటుంబ సభ్యులు మీ–సేవకు వెళ్లడం, స్లాట్లు అయిపోయాయని చెప్పడంతో వెనుదిరగడం పరిపాటిగా మారిపోయింది.సాక్షి, అమరావతి: రవీంద్ర తరహాలో రాష్ట్రంలోని వేలాది మంది దివ్యాంగులు వైకల్య ధ్రువీకరణ పత్రాలకు నోచుకోలేకపోతున్నారు. గద్దెనెక్కిన వెంటనే సామాజిక భద్రతాపింఛన్లకు కోత పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో పింఛన్ల రీ–వెరిఫికేషన్ చేపట్టారు. దివ్యాంగ పింఛన్ లబి్ధదారులకు రీ–అసెస్మెంట్ బాధ్యతను వైద్య శాఖకు అప్పజెప్పారు. ఈ క్రమంలో కొత్త సదరం సరి్టఫికెట్ల ప్రక్రియను వైద్య శాఖ అటకెక్కించింది.వారంలో ఒక్క రోజే2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 56 ప్రభుత్వాస్పత్రుల్లో వారంలో ఒక రోజు మాత్రమే సదరం శిబిరాలు నిర్వహించేవారు. ఈ క్యాంపుల్లో సగటున నెలకు 2715 అసెస్మెంట్లు చేసేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాటి పరిస్థితులు తలపిస్తున్నాయి. పింఛన్ల రీ–అసెస్మెంట్ పేరిట ఏకంగా ప్రభుత్వ వైద్యులనే లబి్ధదారుల ఇళ్లకు కూటమి ప్రభుత్వం పంపింది. ఆస్పత్రుల్లో ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి పింఛన్లకు కోత పెట్టడానికి కంకణం కట్టుకుంది. పింఛన్లు తొలగించి పేదల నోట్లో మట్టికొట్టడంపై పెట్టిన శ్రద్ధలో ఒక వంతైనా కొత్త సదరం సరి్టఫికెట్ల జారీపై చూపడం లేదు. మొక్కుబడిగా వారంలో ఒక్క రోజు (ఏపీవీవీపీ, బోధనాస్పత్రుల్లో ఒక్కో రోజు) మాత్రమే సదరం క్యాంప్‌లను నిర్వహిస్తోంది.అరకొర స్లాట్లు.. అధికంగా పోటీదారులుస్లాట్ రిజిస్ట్రేషన్‌పై ఒత్తిడి తీవ్రమయింది. పైగా విభాగాల వారీ వారానికి వందల సంఖ్యలోనే స్లాట్లు విడుదల చేస్తుండటంతో గంటల్లోనే అయిపోతున్నాయి. దీంతో సదరం స్క్రీనింగ్ కోసం స్లాట్ దక్కించుకోవడమే రాష్ట్రంలోని దివ్యాంగులు, బాధితులకు పదివేలన్నట్లుగా మారింది.వైఎస్ జగన్ హయంలో..2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 56 ఆస్పత్రుల్లో మొక్కుబడిగా సదరం స్క్రీనింగ్ నిర్వహించేవారు. వైఎస్ జగన్ అదనంగా మరో 117 ఆస్పత్రులను కలిపి 173 చోట్ల సదరం శిబిరాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ ఆస్పత్రులోనైనా స్లాట్ బుక్ చేసుకుని అసెస్మెంట్కు హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. దీంతో టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైకల్య ధ్రువీకరణ ప్రక్రియ సులభతరం అయింది. నెలకు 8680 చొప్పున అసెస్మెంట్లు చేపట్టారు. కాగా కూటమి ప్రభుత్వం 61 చోట్ల శిబిరాలను ఎత్తేసింది. 112 చోట్ల వారంలో కేవలం ఒక రోజు మాత్రమే స్క్రీనింగ్ చేపడుతోంది. గతంతో పోల్చితే సగం మేర కూడా అసెస్మెంట్లు జరగని దుస్థితి నెలకొంది. -
అన్నీ బాగున్నా.. ఆ సర్టిఫికెట్ కావాలే! స్థోమతను బట్టి రూ.40 వేల నుంచి లక్ష
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ♦కరీంనగర్లో సుభాష్‌నగర్‌కు చెందిన ఓ విశ్రాంత పోలీసు అధికారి దంపతులు 100శాతం వైకల్యం సర్టిఫికెట్ సంపాదించారు. అందులో భార్యకు అంధత్వం ఉన్నట్టు, సదరు అధికారికి కాళ్లు పనిచేయవని సర్టిఫికెట్ (నంబర్ 09190181710100001) తీసుకున్నారు. ఏఎస్సై హోదాలో రిటైరైన సదరు అధికారి ఇలా దొంగ సర్టిఫికెట్లు తీసుకోవడం ఆశ్చర్యకరం. ♦జమ్మికుంట మండలంలోని ఓ ఊరి సర్పంచ్ భర్త కూడా దివ్యాంగుడిగా సదరం సర్టిఫికెట్ తీసుకున్నాడు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆయనకు ఆ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారో అంతుచిక్కడం లేదు. ♦ఇలా ఒకటీరెండు కాదు కరీంనగర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో తప్పుడు సదరం సర్టిఫికెట్ల వ్యవహారం సాగుతోంది. సదరం సర్టిఫికెట్లు జారీ చేసే కొందరు డిస్ట్రిక్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ (డీఆర్డీఏ) సిబ్బంది, కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే వైద్యసిబ్బంది కలిసి యథేచ్ఛగా ఈ దందాకు తెరలేపారు. అడిగే సర్టిఫికెట్, వారి స్థోమతను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అనర్హులు ఇలా పొందిన సర్టిఫికెట్లతో దివ్యాంగ పింఛన్లు, ఆర్టీసీ, రైల్వే పాసులు, పారిశ్రామిక రాయితీలు, సబ్సిడీ రుణాలు వంటివి పొందుతున్నారు. కొన్నేళ్లుగా నడుస్తున్న ఈ తప్పుడు సదరం సర్టిఫికెట్ల దందా ఇటీవల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు కింద చేసుకున్న దరఖాస్తుతో బయటపడింది. అధికారులు కుమ్మక్కై.. ప్రతినెలా గ్రామాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ముందుగా నోటిఫికేషన్ ద్వారా షెడ్యూల్ ప్రకటించి, వైకల్యం ఉన్నవారిని రావాల్సిందిగా సూచిస్తారు. తర్వాత ఆ నెలలోని ఒక్కోవారంలో వేర్వేరుగా ఆర్థో (ఎముకల సంబంధిత), దృష్టి, వినికిడి, మానసిక వైకల్యం ఉన్నవారిని పరీక్షిస్తారు. సదరు వ్యక్తికి ఏ వైకల్యం ఉంది? ఎంతశాతం లోపం ఉందనేది నిర్ధారించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఇందులో కొందరు వైద్యసిబ్బంది, డీఆర్డీఏలోని కొందరు సిబ్బంది కుమ్మక్కై తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీనిపై అనుమానం వచ్చిన జిల్లాకు చెందిన సామాజిక ఉద్యమకారుడు సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేయడంతో వ్యవహారం మొత్తం బయటపడింది. దివ్యాంగుల జాబితాలో అర్హుల కంటే అనర్హులే అధికంగా ఉండటం చూసి విస్తుపోవాల్సి వచ్చింది. అంతేకాదు.. సదరం సర్టిఫికెట్లు పొందినవారిలో పలువురు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ పోలీసులు, ప్రజాప్రతినిధులు, భూస్వాములు ఉండటం గమనార్హం. 80 శాతం అనర్హులే.. గతంలో జోరుగా నడిచిన తప్పుడు సర్టిఫికెట్ల దందా కోవిడ్ కారణంగా దాదాపు ఏడాదిపాటు ఆగిపోయింది. తిరిగి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ ఏడాది జనవరి వరకు నిర్వహించిన సదరం క్యాంపుల్లో దివ్యాంగులను పరీక్షించి, సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ ఏడాది కాలంలో 1,000కిపైగా సర్టిఫికెట్లు జారీ అయితే.. అందులో దాదాపు 800 మంది వరకు అనర్హులేనని సమాచారం. ఇలా తప్పుడు సర్టిఫికెట్ల కోసం పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలుఉన్నాయి. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.40 వేలదాకా, కొందరి వద్ద అయితే రూ.లక్ష దాకా వసూలు చేసినట్టు తెలిసింది. 800 మంది నుంచి రూ.40 వేల చొప్పున తీసుకున్నట్టు లెక్కించినా.. రూ.32 కోట్లకుపైనే దండుకున్నట్టు అంచనా. ఎక్కడ చూసినా అవే.. తప్పుడు సదరం సర్టిఫికెట్ల దందా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్ రూరల్, మానకొండూరు, కేశవపట్నం, జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంట, తిమ్మాపూర్, చొప్పదండి, వీణవంక, ఎలగందుల, మామిడాలపల్లి, కొత్తగట్టు తదితర మండలాల్లోనూ కొనసాగింది. ఇంక కరీంనగర్ కార్పొరేషన్‌లోని అన్ని వార్డుల పరిధిలో తప్పుడు సర్టిఫికెట్లు పొందినవారు ఉన్నట్టు తెలిసింది. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో నివసిస్తున్న విశ్రాంత పోలీసు అధికారి దంపతులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్న విషయం పరిశీలనలో వెల్లడైంది. వారి పనులు వారే చేసుకుంటున్నా.. సదరు విశ్రాంత అధికారి కదల్లేడని, అతడి భార్యకు కంటిచూపు లేదని సర్టిఫికెట్లు జారీ చేసిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిజమైన అర్హులను నెలల తరబడి తిప్పుకొంటున్నారని, అలాంటిది ప్రభుత్వ పింఛన్ తీసుకునేవారికి 100% వైకల్యమున్నట్టు సర్టిఫికెట్ ఎలా ఇస్తారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ‘తప్పు’తో మరెన్నో అక్రమాలు ప్రభుత్వం దివ్యాంగ పింఛన్ కింద నెలకు రూ.3,016 ఇస్తుండటంతో చాలా మంది తప్పుడు సదరం సర్టిఫికెట్ల కోసం ఎగబడుతున్నారు. అధికారులు దీనిని ‘ఆసరా’గా తీసుకుని ఒక్కొక్కరి నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. తప్పుడు సర్టిఫికెట్లు పొందినవారిలో చాలా మంది ఆసరా పింఛన్లు పొందుతున్నట్టు తేలింది. అదే సమయంలో విశ్రాంత ఉద్యోగులు, ధనవంతులు, స్థానిక ప్రజాప్రతినిధులూ తప్పుడు సర్టిఫికెట్లు తీసుకోవడంపై సందేహాలు వస్తున్నా యి. చాలామంది వివిధ దివ్యాంగుల కోటాలో బస్సు, రైల్వే పాసులు తీసుకున్నారని తెలిసింది. మరికొందరు ఆదాయపన్ను మినహాయింపు కోసం వాడుతున్నట్టు బయటపడింది. ఇంకొం దరు పారిశ్రామికంగా రాయితీలు, బ్యాంకు రుణాలు, వాహనాల్లో సబ్సిడీలు పొందుతున్నట్టు సమాచారం. కొందరైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో దివ్యాంగుల కోటా ఉద్యోగాల్లోనూ చేరినట్టు ఆరోపణలు ఉన్నాయి. -
భర్తను భుజాలపై మోస్తూ..ఫోటో వైరల్
సాక్షి, మధుర : దివ్యాంగుడైన భర్తను తన భుజాలపై ఎక్కించుకుని వెళ్తున్న ఓ మహిళ ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భర్తను భుజాలపై మోసుకు వెళుతున్న ఆమెకు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన బిమ్లా దేవి అనే మహిళ.. నరాల సంబంధిత వ్యాధితో కుడికాలు కోల్పోయిన తన భర్త బదన్ సింగ్‌ను గత కొన్ని నెలలుగా భుజాలపై ప్రభుత్వ ఆస్పత్రికి మోసుకెళుతోంది. బదన్ సింగ్‌కు వీల్ చైర్ ఇవ్వడానికి ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు... దివ్యాంగుడని ధ్రువీకరణ పత్రం తీసుకు రమ్మన్నారు. దీంతో ఆమె ఆ సర్టిఫికేట్ కోసం భర్తను మోసుకుని వెళుతూ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ చాలాకాలంగా తిరుగుతోంది. అయినా అధికారులు ఏమాత్రం కనికరించలేదు. సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఆమెను కార్యాలయం చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా బిమ్లా దేవి మాట్లాడుతూ.. ధ్రువీకరణ పత్రం పొందడానికి చాలా కార్యాలయాల చుట్టూ తిరిగాం. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయింది. అయితే భర్తను అలా మోసుకు వెళుతున్న ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ దంపతుల ఫోటో ఉత్తరప్రదేశ్ మంత్రి భూపేంద్ర చౌదరి కంట పడింది. దీనిపై స్పందించిన ఆయన... వారికి సహాయం అందకపోవడం నాగరిక సమాజానికి సిగ్గుచేటని, వెంటనే ఆ భార్యాభర్తలకు సహాయం అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు. ఎట్టకేలకు బుధవారం బిమ్లా దేవి దంపతులకు ధ్రువీకరణ పత్రం అందడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొద్ది నెలల ముందు వరకు వారి జీవితం సాఫీగా సాగిపోయేదని, నరాల వ్యాధి కారణంగా తన భర్త కాలు కోల్పోవడంతో కష్టాలు చుట్టుముట్టాయని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆటోలో వెళ్లడానికి కూడా డబ్బులు లేవని, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నామని ఆమె వివరించింది. భర్త కాలుపోవడంతో కుటుంబ భారంతో పాటు భర్తకు మందులు కొనే బాధ్యత కూడా బిమ్లా భుజాలపై పడింది. -
వికలాంగులకు ప్రత్యేక కార్డులు
ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలన్న కేంద్రం ⇒ ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశం ⇒ రాష్ట్రంలో ఇప్పటికే సదరం ద్వారా వికలత్వ నిర్ధారణ సర్టిఫికెట్లు జారీ ⇒ వీటిని ప్రామాణికంగా తీసుకోవాలంటున్న వికలాంగుల సంక్షేమ శాఖ సాక్షి, హైదరాబాద్: ప్రతి దివ్యాంగుడికి విశిష్ట వికలత్వ గుర్తింపు(యూడీఐడీ) కార్డును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఇస్తున్నట్లుగా.. వికలాంగులకు కూడా ప్రత్యేకంగా యూడీఐడీ ఇచ్చేలా కార్యాచరణ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రాల వారీగా చర్యలు చేపట్టాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో ఆధార్ కార్డుకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. ఆధార్ అనుసంధానంతో అమలు చేస్తున్న పథకాల్లో పారదర్శకతతో పాటు సులభతరం కావడంతో వికలాంగులకు ఇదే తరహాలో ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగుల కోటా భర్తీ ప్రక్రియకు ఈ కార్డులు కీలకం కానున్నాయి. అంతేకాకుండా వికలాంగులకు ఇచ్చే యూడీఐడీ కార్డులు దేశవ్యాప్తంగా చెల్లుబాటు కానున్నాయి. రాష్ట్రంలో 10.5 లక్షల మంది.. రాష్ట్రవ్యాప్తంగా 10.5 లక్షల మంది దివ్యాంగులున్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పేరిట అమలు చేస్తున్న సామాజిక భద్రత పథకం కింద 6.46 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి నెలకు రూ.1,500 చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. ఆసరా పింఛన్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి వికలత్వాన్ని నిర్ధారిస్తోంది. ఇందులో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి... 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు ఆసరా లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సదరం (సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిసేబుల్ ఫర్ యాక్సిస్ రిహబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్) క్యాంపుల ద్వారా ఇచ్చిన సర్టిఫికెట్లను ప్రామాణికంగా తీసుకోవాలని కోరేందుకు రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే వైద్య నిపుణులతో నెలల తరబడి గ్రామాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి... యూడీఐడీలో పేర్కొన్న నిబంధనల ప్రకారమే పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నందున, సదరం లింకును యూడీఐడీకి జతచేసేలా కోరతామని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు.