మూడు రాజధానులకు రాజముద్ర పడిందిలా..

AP Governor Biswabushan Approved To Decentralised Bill - Sakshi

న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న గవర్నర్‌

3 వారాల పరిశీలన, సంప్రదింపుల తర్వాత ఆమోదం

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ వాదనలు, కోర్టు కేసులు, శాసనమండలిలో నాటకీయ పరిణామాల అనంతరం సీఆర్‌డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. మూడు రాజధానులకు తొలినుంచీ వ్యతిరేకంగా కుట్రలు పన్నిన ప్రతిపక్ష టీడీపీకి ఈ పరిణామం కంటగింపులాంటిదే. మండలిలో బిల్లును అడ్డుకోవడం, కోర్టుల్లో కేసుల వేయడం వంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడ్డ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిల్లుకు గవర్నర్‌ చేత ఆమోదం లభించకుండా ఉండేందుకు చివరి వరకూ ప్రయత్నాలు చేశారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం)

ప్రభుత్వ నిర్ణయానికే ఓటు..
అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు ప్రజా ఆమోదం కలిగిన శాసనసభ రెండుసార్లు ఆమోందించిన బిల్లును వెనక్కిపంపడం భావ్యం కాదని భావించిన గవర్నర్‌ హరిచందన్‌ ప్రభుత్వ నిర్ణయానికే ఓటు వేశారు. అనేక వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మూడు వారాల పాటు బిల్లును పూర్తిగా పరిశీలించిన అనంతరమే మూడు రాజధానులకు రాజముద్ర వేశారు. శాసనసభ ఆమోందించిన వెంటనే తన నిర్ణయం చెప్పని గవర్నర్‌ వికేంద్రీకరణ బిల్లుపై సమగ్ర పరిశీలన జరిపారు. బిల్లుకు సంబంధించి పలు అంశాలపై విస్తృత పరిశీలన చేశారు. కోర్టు కేసుల నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలు సైతం తీసుకున్నారు. (పరిపాలన రాజధానికి త్వరలోనే శంకుస్థాపన)

బిల్లు తీసుకురావడంలో శాసనసభ అనుసరించిన విధానాన్ని పరిశీలించారు. అంతేకాకుండా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల అంశాన్నికూడా గవర్నర్‌ పరిగణలోకి తీసుకుని తన నిర్ణయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న కేసులు.. బిల్లుల ఆమోదంపై ప్రభావితం చూపుతాయా? అన్న అంశంపై న్యాయ నిపుణలతో చర్చించి, పరిశీలించారు. పునర్‌విభజన చట్టానికి అనుగుణంగా ఉందా? అనే అంశంపై సైతం ఆరా తీశారు. శాసన మండలిలో జరిగిన సంఘటనలపై.. శాసనసభ కార్యదర్శి నుంచి నివేదిక తెప్పించుకుని అధ్యాయం చేశారు. చంద్రబాబు, కన్నా, శైలజానాద్‌లో హైకోర్టులో దాఖలు చేసిన వివిధ పిటిషన్లను పరిశీలించి 3 వారాల విస్తృత పరిశీలన, సంప్రదింపుల తర్వాత మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. (గవర్నర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top