AP Government Orders CID Probe Into AP State FiberNet Limited Irregularities - Sakshi
Sakshi News home page

ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాలపై సీఐడీ విచారణ

Jul 11 2021 5:42 PM | Updated on Jul 12 2021 9:41 AM

AP Government Orders CID Investigation On Corruption In Fiber Net Project - Sakshi

సాక్షి, విజయవాడ :  గత ప్రభుత్వంలో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఫైబర్‌నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌ అక్రమాలకు నిలయంగా మారింది. టీడీపీ పెద్దల అండతో యథేచ్ఛగా అక్రమాలు జరిగాయి. కాంట్రాక్టర్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించడంతో  ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండిపడింది. 

Advertisement
 
Advertisement
Advertisement