లోన్ యాప్స్ ఆగడాలపై పూర్తి స్థాయిలో నిఘా: ఏపీ డీజీపీ

సాక్షి, అనంతపురం: లోన్ యాప్స్ ఆగడాలపై లోతుగా విచారణ చేస్తున్నామని.. వీటిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించిన నలుగురిని అరెస్ట్ చేశామన్నారు.
చదవండి: తిట్టుకున్న టీడీపీ మహిళా నేతలు.. గొడవ ఎందుకంటే?
లోన్ యాప్ బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామన్నారు. పోలీసులపై రాజకీయ నాయకులు విమర్శలు మానుకోవాలన్నారు. నిరాధారణమైన ఆరోపణలు చేసే రాజకీయ నేతలు విశ్వసనీయతను కోల్పోతారని డీజీపీ అన్నారు.
సంబంధిత వార్తలు