ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లపై సీఎస్ జవహర్ రెడ్డి ఆగ్రహం

అమరావతి: ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లపై సీఎస్ జవహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియాపై మండిపడ్డారు. ఈ సంస్థలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
'సీఎస్‌తో కలిసివెళ్లిన ఓఎస్డీ అంటూ రాసిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను కడప జిల్లాలోని సింహాద్రిపురం, మద్దూనూరులో 3న పర్యటించా. నేను, ఓఎస్డీ కృష్ణమోహన్ కలిసి ఇద్దరం ఒకే వాహనంలో ప్రయాణించామని తప్పుడు కథనం ప్రచారం చేశారు. నాతో కలిసి ఓఎస్డీ వచ్చారన్న కథనం ఊహాజనితం, దారుణమైన అబద్ధం. ఉద్యోగులందరికీ అధినేత అయిన సీఎస్‌ను చులకన చేసేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి.
కుట్రపూరితంగా కట్టు కథను అల్లి అజెండా ప్రకారం తప్పుడు ప్రచారం చేశారు. గౌరవ ప్రదమైన ప్రభుత్వ కార్యదర్శి ప్రతిష్టకు భంగం కలిగించడం ఏ జర్నలిజం విలువల ఆధారంగా చేస్తున్నారు. నేను కోరిన విధంగా ఖండన ప్రచురించకపోతే చట్టపరంగా చర్యలుంటాయి.' అని సీఎస్ జవహర్ రెడ్డి హెచ్చరించారు.
చదవండి: పవన్ కల్యాణ్‌కు పంపబోయిన లేఖ నాకు పంపారా? హరిరామ జోగయ్యకు అమర్నాథ్ కౌంటర్..
మరిన్ని వార్తలు :