ఫ్యామిలీ డాక్టర్‌ ద్వారా 92 లక్షల మందికి సేవలు | AP CM Launches Family Doctor Programme Services To 92 Lakh People | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ డాక్టర్‌ ద్వారా 92 లక్షల మందికి సేవలు

May 6 2023 9:33 AM | Updated on May 6 2023 10:54 AM

AP CM Launches Family Doctor Programme Services To 92 Lakh People - Sakshi

సాక్షి, అనంతపురం క్రైం: పేదల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం దేశానికే ఆదర్శమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. దీని ద్వారా వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల పరిధిలో 92 లక్షల మందికి వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు. శుక్రవారం ఆమె అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారికందుతున్న సేవలపై ఆరా తీశారు. దీర్ఘకాలిక నొప్పు­లతో బాధపడే వారి కోసం సర్వజనా­స్పత్రిలో ఏర్పాటు చేసిన పెయిన్‌ రిలీఫ్‌ క్లినిక్‌ను, రూ.3.46 కోట్లతో ఏర్పాటు చేస్తున్న బరన్స్‌వార్డును మంత్రి ప్రారంభించారు.

సూప­ర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివిధ విభాగాల వై­ద్యు­లతో సమీక్ష సమావేశం నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కా­రానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా­రు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లా­డారు. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా జగన్‌­మోహన్‌రెడ్డి వైద్య రంగంలో ఎన్నో మార్పు­లకు శ్రీకారం చుట్టారన్నారు. ఏపీ చరిత్రలోనే 49 వేల మంది సిబ్బందిని నియ­మిం­చారని తెలిపారు. రాష్ట్రంలో 17 వైద్య కళాశా­లలను తీసుకురావాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారని చెప్పారు.

అందులో ప్రాధాన్యత క్రమంలో ఐదు వైద్య కళాశాలల్లో (విజయ­నగరం, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి) ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు చేపడు­తున్నట్లు తెలిపారు. రాజమండ్రి మిన­హా అన్ని కళాశా­ల­లకు ఎన్‌ఎంసీ అనుమతులు వచ్చాయ­న్నారు. రాజమండ్రి కళాశాల తనిఖీ పూర్తయితే దానికీ అనుమతులు వస్తాయని స్పష్టం చేశారు. కార్య­క్రమంలో అనంతపురం ఎంపీ తలారి రంగ­య్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ, ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్‌ సత్యవరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: థాంక్యూ సీఎం సార్‌ ! సీఎం జగన్‌ చిత్రపటానికి డీఎస్సీ 1998 ఉద్యోగుల క్షీరాభిషేకం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement