చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈవో సిఫార్సు | AP CEO MK Meena Letter TO ECI Chandrababu Comments On CM Jagan | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈవో సిఫార్సు

Apr 23 2024 7:17 PM | Updated on Apr 23 2024 7:49 PM

AP CEO MK Meena Letter TO ECI Chandrababu Comments On CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎలక్షన్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ కుమార్‌ మీనాకు వైఎస్సార్‌సీపీ 18 సార్లు ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు సీఈవో పలుమార్లు నోటీసులు జారీ చేశారు. 

అయితే కొన్ని నోటీసులకే మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు.. కొన్ని నోటీసులపై స్పందించలేదు. చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సీఈవో మీనా సంతృప్తి చెందలేదు. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించారు. బాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్యకార్యదర్శి అవినాష్‌ కుమార్‌కు సీఈవో మీనా లేఖ రాశారు. బాబు మాట్లాడిన వీడియో క్లిప్పులను కూడా జత చేశారు.
చదవండి: పవన్‌ కల్యాణ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement