
(ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి: ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ కోసం ఈనెల 6వ తేదీ సాయంత్రంలోపు అన్ని శాఖలకు సంబంధించి చర్చించాల్సిన అంశాలను తీసుకురావాలని సీఎస్ సమీర్ శర్మ.. చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఇటీవల మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో తీసుకున్న నిర్ణయాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.