ఇదే నా ఎకనామిక్స్‌.. ఇదే నా పాలిటిక్స్‌: అసెంబ్లీలో సీఎం జగన్‌

AP Assembly Budget 2023-24 Session March 15 Day 2 Live Updates - Sakshi

Time: 04:00 PM

అసెంబ్లీలో సీఎం జగన్‌

►నా లక్ష్యం.. పేదరిక నిర్మూలనే
►గత ప్రభుత్వం గాల్లో నడిస్తే.. నేను నేలపై నడుస్తున్నా
►నా యుద్ధం పెత్తందార్లుతోనే.. ఇదే నా ఎకనామిక్స్‌.. ఇదే నా పాలిటిక్స్‌
►నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే
►ఇదే మా నాన్నను చూసి నేర్చుకున్నా హిస్టరీ
►ఇవన్నీ కలిపితే మీ జగన్‌

►30.75 లక్షల ఇళ్ల పట్టాలు అందించాం. 
►అభివృద్ధిలో దేశానికే ఏపీ రోల్‌ మోడల్‌గా నిలిచింది.
►ఏ రాష్ట్రంలో లేని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చాం. 
►ఇప్పటికే దిశ పోలీస్‌ స్టేషనలు ప్రతిచోట కనిపిస్తున్నాయి.
►రాష్ట్రంలో 1.36 కోట్ల మంది దిశయాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

►11.28 శాతం ఆర్థిక వృద్ధి రేటు ఏ రాష్ట్రంలోనూ లేదు.
►ఆర్థిక నిపుణులే అధ్యయనం చేసేలా ఆర్థిక వృద్ధి రేటు ఉంది.
►రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచాం.
►ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం అండగా ఉంది.
►మనం వచ్చాక మరో 1.50 లక్షల ఎంఎస్‌ఎంఈలు వచ్చాయి.

►వ్యవసాయంపై 62% జనాభా ఆధారపడి ఉంది.
►30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించాం.
►వైద్యరంగంలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం.
►గ్రామ స్థాయిలో 10,500 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం.

►విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పనిచేస్తున్నాం.
►లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరుగుతోంది.
►డీటీబీ ద్వారా లబ్ధిదారులకు రూ. 1,97,473 కోట్లు అందించాం.
►నిన్నటి కంటే నేడు, నేటి కంటేరేపు బాగున్నప్పుడే అభివృద్ధి.
►గడప గడపకు వెళ్లి మేము చేసిన మంచిని చెప్తున్నాం.
►రాష్ట్రంలో జిల్లాల పెంపుతో సేవలు మరింత చేరువయ్యాయి.
►సచివాలయాల్లో దాదాపు 600 సేవలు అందుతున్నాయి.
►ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ సేవలందిస్తున్నారు.

►మేనిఫెస్టోలో 98.5 శాతం హామీలను నెరవేర్చాం.
►మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంధం అని నిరూపించాం.
►రాజకీయ వ్యస్థలో గొప్ప మార్పును తీసుకొచ్చాం.
►పాలనలో పారదర్శకత తీసుకొచ్చేలా నాలుగేళ్ల పాలన సాగింది.
►కులం, మతం, ప్రాంతం, పార్టీని చూడకుండా పథకాలు అమలు చేశాం.
► ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని మనస్పూర్తిగా చెప్పగలుగుతున్నా.

Time: 3:40 PM

ఎమ్మెల్యే కళావతి ప్రసంగం
► మహిళల రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది

►మహిళలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 
►సీఎం జగన్‌ పాలనలో గిరిజనులకు న్యాయం జరుగుతోంది.
► గిరిజన ప్రాంతంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు.

Time: 3:00 PM

సీఎం జగన్‌ నాలుగేళ్ల పాలన ఓ సక్సెస్‌ స్టోరీ
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రతి పేద కుటుంబానికి మేలు జరుగుతోందని, దేశంలోనే అత్యుత్తమ నమూనాగా సీఎం జగన్‌ పాలన ఉందని కన్నబాబు స్పష్టం చేశారు. సీఎం జగన్‌ నాలుగేళ్ల పాలన ఓ సక్సెస్‌ స్టోరీ అని, సంక్షేమం, అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌గా కేరాఫ్‌గా మారిందని పేర్కొన్నారు.

‘మేనిఫెస్టోలో ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం మాది. మేనిఫెస్టో కనబడకుండా చేసిన ఘనత టీడీపీది. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలే పెత్తనం చేశాయి. ప్రభుత్వంపై బురద చల్లడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది’ అని మండిపడ్డారు.

Time: 02:17PM
టీడీపీవి తప్పుడు ఆరోపణలని మంత్రి బుగ్గన విమర్శించారు. గవర్నర్‌పై టీడీపీ సభ్యులు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ తన వక్రబుద్ధిని మార్చుకోవాలని హితవుపలికారు. టీడీపీ వ్యవహార శైలి సభా హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Time: 02:17PM

పార్థసారథి ప్రసంగం

  • విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం గొప్ప ప్రగతి సాధించింది
  • ప్రభుత్వ పాఠశాలు నేడు కార్పోరేట్‌కు ధీటుగా రూపుదిద్దుకుంటున్నాయి
  • ప్రభుత్వ స్కూళ్లలో నేడు టాయిలెట్లు మెరుగుపడ్డాయి
  • స్కూళ్లలో నాడు-నేడు కోసం ప్రభుత​ం 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది
  • సచివాలయాలు వాలంటీర్‌ వ్యవస్థతో పేదలకు మేలు జరుగుతోంది
  • సీఎం జగన్‌ పాలనలో పేదలకు నేరుగా లబ్ది చేకూరుతోంది
  • చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు
  • వాలంటీర్‌ వ్యవస్థను దేశ ప్రధానే ప్రశంసించారు

Time: 01:57 PM
టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌
గవర్నర్‌ను కించపరిస్తే సహించాలా?.. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటామని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రివిలేజ్‌ కమిటీ ముందు వీడియో ప్రదర్శిస్తామన్నారు. దీనిపై కఠిన చర్యలు ఉంటాయని స్పీకర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసేంత వరకు ఈ సస్పెన్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు.

Time: 01:19 PM
చంద్రబాబు, ఎల్లో మీడియా తోడు దొంగలు: మాజీ మంత్రి కన్నబాబు
ఎల్లోమీడియా వక్రీకరిస్తోంది
టీడీపీ నేతలు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో​ గవర్నర్‌కు అర్థమైంది
భయానక పరిస్థితులు సృష్టించే కుట్ర చేస్తున్నారు
రాజ్యాంగ వ్యవస్థను కించపర్చేలా వ్యవహరిస్తున్నారు

Time: 01:14 PM
మమ్మల్నీ ఎదుర్కొనే ధైర్యం మీకు ఉందా?: మంత్రి జోగి రమేష్‌
పయ్యావుల కేశవ్‌ ప్రివిలేజ్‌ కమిటీకి క్షమాపణ చెప్పాలి
ఈనాడులో అడ్డగోలుగా వార్తలు ఎలా రాస్తారు?
బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి

Time: 12:38 PM
గవర్నర్‌ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం: మంత్రి బుగ్గన
గవర్నర్‌ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో ఆయన మాట్లాడుతూ, గవర్నర్‌ ప్రసంగంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. గవర్నర్‌కు సీఎం స్వాగతం పలకలేదని టీడీపీ తప్పుడు ప్రచారంపై వీడియోలతో సహా వాస్తవాలను మంత్రి బయటపెట్టారు.

Time: 12:26 PM
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌: పవన్‌ పవర్‌ స్టార్‌ కాదని.. ఫ్లవర్‌ స్టార్‌ అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. ‘‘నీ మాటలు అన్నీ విడ్డూరంగా ఉన్నాయి. కాపు కులం అంతా సీఎం జగన్‌ వైపే ఉంది. రాజకీయంలో ఓ అజెండా ఉండాలి. జనసేన తొత్తుల పార్టీ’’ అని కరణం ధర్మశ్రీ దుయ్యబట్టారు.

Time: 12:16 PM
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌: రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ జనసేన అని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ఏ ఉద్దేశంతో నిన్న సభ పెట్టారో పవన్‌కే తెలీదు.. జెండా పవన్‌ది.. అజెండా టీడీపీది అంటూ మంత్రి అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు.

Time: 11:56 AM
శాసనసభలోని సీఎం చాంబర్‌లో సోషియో ఎకనామిక్‌ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు.

Time: 10:17 AM
సీఎం జగన్‌ ప్రభుత్వ స్కూళ్లకు ప్రాణం పోశారు: మంత్రి బొత్స
చంద్రబాబు హయాంలో 5వేల స్కూళ్లను మూసేశారని, సీఎం జగన్‌ ప్రభుత్వ స్కూళ్లకు ప్రాణం పోశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మా హయాంలో ఏ ఒక్క స్కూలు మూతపడలేదు.. ఏ ఊరులో స్కూలు మూతపడిందో చెప్పాలి’’ అంటూ మంత్రి బొత్స సవాల్‌ విసిరారు.

Time: 9:54 AM
సీఎం జగన్‌ పాలనలో సమృద్ధిగా వర్షాలు: అబ్బయ్య చౌదరి
సీఎం జగన్‌ పాలనలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అన్నారు. ‘‘రైతుల కోసం సీఎం జగన్‌ ఎన్నో చేశారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు.. సీఎం జగన్ వ్యవసాయం పండగ అంటున్నారు’’ అని అబ్బయ్య చౌదరి అన్నారు.

Time: 9:50 AM
కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఎవరు ఏం చేశారో అందరికీ తెలుసునని మంత్రి అన్నారు. ‘‘టీడీపీ అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను. ఎందుకు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Time: 9:40 AM
ఇలా వ్యవహరించడం ఇది సమంజసం కాదు: స్పీకర్‌
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే వినతి పత్రం సభ నిబంధనలకు అనుగుణంగా ఇవ్వాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. సభలో ఇలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.

Time: 9:31 AM
అసెంబ్లీకి బయల్దేరిన సీఎం జగన్‌
తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి బయలుదేరారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు.

Time: 9:24 AM
వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదు: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ‘‘ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధింత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తాం. ఎక్కడ ఏ వేదిక మీద ఎలా  ప్రస్తావించాలో తెలుసుకోవాలి’’ అంటూ మంత్రి బుగ్గన హితవు పలికారు. 

Time: 9:15 AM
నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్‌రెడ్డి: మంత్రి అంబటి
కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శ్రీధర్‌రెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా?. కోటంరెడ్డి నమ్మకద్రోహి.. చంద్రబాబు, టీడీపీ కోసం ఆయన పని చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. శ్రీధర్‌రెడ్డి.. టీడీపీతో చేతులు కలిపారు. దురుద్దేశ్యంతోనే కోటంరెడ్డి ఆందోళన చేస్తున్నాడు. నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్‌రెడ్డి. చంద్రబాబు మెప్పుకోసం కోటంరెడ్డి మాట్లాడుతున్నాడు. నమ్మకద్రోహం చేసినవారికి పుట్టగతులు లేకుండా పోతాయి’’ అంటూ మంత్రి అంబటి నిప్పులు చెరిగారు.

Time: 9:11 AM

టీడీపీ సభ్యులు.. సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు

ఏపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు

Time: 9:05 AM

రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు.

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు. ఇటీవల మరణించిన ఎమ్మెల్సీలు చల్లా భగీరథరెడ్డి, బచ్చుల అర్జునుడికి శాసనసభ సంతాపం తెలపనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top