"కరోనా కాలంలోనూ వైఎస్‌ జగన్‌ వెలిగొండ పనులను ఆపలేదు" | Anil Kumar Yadav Veligonda Project Background and Credit | Sakshi
Sakshi News home page

"కరోనా కాలంలోనూ వైఎస్‌ జగన్‌ వెలిగొండ పనులను ఆపలేదు"

Aug 31 2026 5:33 PM | Updated on Aug 31 2026 6:03 PM

Anil Kumar Yadav Veligonda Project Background and Credit

నెల్లూరు: కరోనా కాలంలో కూడా వెలిగొండ ప్రాజెక్టు పనులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆపలేదని మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ఘనత వైఎస్సార్‌, వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిదేనని చెప్పారు. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 30.5 కిలోమీటర్ల టన్నెల్స్‌ పూర్తి చేశారని అనన్నారు. వెలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెల్స్‌ పొడవు 37 కిలోమీటర్లని వివరించారు. 

"వెలుగొండ ప్రాజెక్ట్ నేనే ప్రారంభించా, నేనే పూర్తి చేశా అని చంద్రబాబు క్రెడిట్ చోరికి పాల్పడ్డాడు. 1996 లో శంకుస్థాపన చేసి ఎనిమిది ఏళ్లు సీఎంగా వున్న చంద్రబాబు ఒక తట్ట మట్టి ఎత్తిన దాఖలాలు లేవు. మొత్తం ప్రాజెక్ట్ వర్క్ లో 37.6 కి.లో సొరంగాలు తవ్వకాలు జరిపి పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్, జగన్ ది. 53.8 టీఎంసీ గల డ్యామ్ 87% శాతం నిర్మాణం వైఎస్ఆర్, జగన్ లే పూర్తి చేశారు. 

చంద్రబాబు పాలనలో రోజుకి 2.4 మీటర్ల పని మాత్రమే జరిగిదే. జగన్ హయాంలో కరోనా పరిస్థితిలో కూడా రోజుకు 4.5 మీటర్లు పనులు జరిగివే. 2024 జనవరిలో రెండు టనల్స్, హెడ్ రెగులేటర్స్ పూర్తి చేసి జగన్ ప్రారంభించారు. అదానీ డేటా సెంటర్ పేరు మార్చి నా క్రెడిట్ అనడం, విమానాశ్రయాల క్రెడిట్ ను దోచుకోవడం ఇంకా ఎన్ని దారుణాలకు పాల్పడుతాడు. 

రాష్ట్రంలో నేడు మా హయాంలో జరిగి దాదాపు పూర్తి కావచ్చని అన్ని పనుల తాలూకా క్రెడిట్ చోరికి పాల్పడుతున్నారు. మార్కాపురంలో మెడికల్ కాలేజ్, ఆసుపత్రి ప్రారంభాన్ని అడ్డుకుని నేడు మార్కాపురాన్ని నేనే అభివృద్ధి చేశా అనడం హస్యాస్పదం. మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన స్థాయి దిగజారి జగన్ మోహన్ రోడ్డుపై విమర్శలు చేయడం దారుణం.

బీదా రవిచంద్ర మీకు చిత్త శుద్ధి వుంటే నెల్లూరు రైతాంగం గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయాలు మాట్లాడటం మానీ వెన్నుపోటు చంద్రబాబు రాజకీయంపై స్పందించండి. మీ నాయకుడు చంద్రబాబు బీసిలకు ఎందుకు రాజ్యాంగబద్ధ పదవులు ఇవ్వలేక పోయారు మొదట సమాధానం చెప్పాలి. సోమశిల ఆప్రాన్ పనులు నేను మంత్రిగా వున్న సమయంలో టెండర్లు పిలిచి 20% పైగా పనులు చేశాం. నేడు కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏడాదిలో ఒక్క శాతం పని జరగలేదు" అని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పారు.

ఇదీ చదవండి: ఇరాన్‌ అధ‍్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement