ఏపీలో కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల | Andhra Pradesh Police Prelims Results Released | Sakshi
Sakshi News home page

ఏపీలో కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల

Feb 5 2023 11:44 AM | Updated on Feb 5 2023 11:50 AM

Andhra Pradesh Police Prelims Results Released - Sakshi

అమరావతి: ఏపీ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 95, 208 మంది అభ్యర్తులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల సంఖ్య 4, 59, 182గా ఉంది. 

6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్‌ చేయగా.. 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 22వ తేదీన ఈ పరీక్ష నిర్వహించారు. ఇందుకు గాను 997 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే రోజు పరీక్షా కీ విడుదల చేసిన రిక్రూట్‌మెంట్‌ బోర్డు.. 25వ తేదీ వరకూ కీపై అభ్యంతరాలకు సమయం ఇచ్చింది. కాగా, ఈరోజు (ఆదివారం) ఫలితాల్ని విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement