మినీ బ్యాంక్‌లు ఆర్‌బీకేలు.. రైతుల చెంతకే బ్యాంకింగ్‌ సేవలు | Andhra Pradesh: All Set For Banking Services In Rythu Bharosa Kendram | Sakshi
Sakshi News home page

మినీ బ్యాంక్‌లు ఆర్‌బీకేలు.. రైతుల చెంతకే బ్యాంకింగ్‌ సేవలు

Jul 7 2022 7:48 PM | Updated on Jul 8 2022 7:29 AM

Andhra Pradesh: All Set For Banking Services In Rythu Bharosa Kendram - Sakshi

పాండురంగాపురం రైతు భరోసా కేంద్రం

587 మంది బిజినెస్‌ కరస్పాండెంట్లు నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 874 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో రైతులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునేందుకు వివిధ బ్యాంకులకు చెందిన 587 మంది బిజినెస్‌ కరస్పాండెంట్లను ఏర్పాటు చేశారు. వీరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 2.47 లక్షల మంది రైతులతోపాటు ప్రజలకు కూడా ఈ సేవలు అందిస్తారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఇప్పటికే ఎన్నో సేవలు అందిస్తున్న ఆర్‌బీకేలు.. మరో సేవకు సిద్ధమయ్యాయి. ఇకపై పల్లెల్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాలనూ తీర్చనున్నాయి. అందులో భాగంగా బ్యాంక్‌లు, ఏటీఎంల పాత్రలను పోషించనున్నాయి. తక్షణ అవసరం నిమిత్తం రూ.20 వేల వరకు సమకూర్చేందుకు జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏర్పాటు ప్రధానంగా రైతుల కోసం చేసినా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకునే వెసులు బాటూ కల్పించడంతో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి,నంద్యాల: అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకేసి ఆర్థిక సేవలనూ వారి ముంగిట్లోకే తెచ్చింది. రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటి వరకు అందుతున్న సేవలతో పాటు బ్యాంకు సేవలనూ ప్రవేశపెట్టింది. పల్లె రైతులు, ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా అవసరమైనప్పుడు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. అందుకు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 874 రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంక్‌ల సాయంతో 587 మంది బిజినెస్‌ కరస్పాండెంట్లను నియమించింది. వీరి ద్వారా రైతులకు అవసరమైన చిన్నచిన్న లావాదేవీలను బ్యాంకుల వద్దకు వెళ్లకుండా పూర్తి చేస్తోంది.

సాధారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం 5 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో బ్యాంకు బ్రాంచ్‌ ఏర్పాటు చేయాలి. కానీ బ్యాంకుల విలీనంతో కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోయినా బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా రైతులు, పల్లె ప్రజల అవసరాలను తీర్చనుంది. 587 మంది బిజినెస్‌ కరస్పాండెంట్లు నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 874 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో రైతులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునేందుకు వివిధ బ్యాంకులకు చెందిన 587 మంది బిజినెస్‌ కరస్పాండెంట్లను ఏర్పాటు చేశారు. వీరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 2.47 లక్షల మంది రైతులతోపాటు ప్రజలకు కూడా ఈ సేవలు అందిస్తారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఇప్పటికే ఎన్నో సేవలు అందిస్తున్న ఆర్‌బీకేలు.. మరో సేవకు సిద్ధమయ్యాయి. ఇకపై పల్లెల్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాలనూ తీర్చనున్నాయి. అందులో భాగంగా బ్యాంక్‌లు, ఏటీఎంల పాత్రలను పోషించనున్నాయి. తక్షణ అవసరం నిమిత్తం రూ.20 వేల వరకు సమకూర్చేందుకు జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏర్పాటు ప్రధానంగా రైతుల కోసం చేసినా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకునే వెసులు బాటూ కల్పించడంతో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

సమయం వృథా అయ్యేది 
ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం సంతోషకరం. మా గ్రామంలో బ్యాంకు కానీ, ఏటీఎం కానీ లేకపోవడంతో నగదు తీసుకోవాలన్నా, ఖాతాలోకి వేయాలన్నా నంద్యాలకు వెళ్లాల్సి ఉండేది. దీని వల్ల సమయం వృథా అయ్యేది. జగనన్న ప్రభుత్వం ఆర్‌బీకేల్లోనే బ్యాంకింగ్‌ సేవలు పెట్టడంతో ఆ బాధలు తప్పాయి. బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. 4 కి.మీ వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే డబ్బులు తీసుకుంటున్నాం. జమ చేస్తున్నాం.   
– బంగారురెడ్డి, రైతు, చాబోలు 

సేవలకు రుసుమేమీ లేదు
ప్రతిరోజూ బిజినెస్‌ కరస్పాండెంట్లు గంట నుంచి 2 గంటల పాటు ఆర్‌బీకేల్లో వేచి ఉంటారు. ఆయా గ్రామాల్లో రైతుల వెసులుబాటును బట్టి సమయాన్ని సర్దుబాటు చేసుకునే విధంగా బిజినెస్‌ కరస్పాండెంట్లకు ఆదేశాలు జారీ చేశాం. 2 వేల జనాభా కలిగిన గ్రామాల్లో ఈ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ ఆర్‌బీకే ఉన్న ప్రతి గ్రామంలో రైతులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా బిజినెస్‌ కరస్పాండెంట్లకు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
-వెంకటనారాయణ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్, కర్నూలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement